Title (Indic)ఆతురబందుగుఁడవు హరినారాయణ కృష్ణ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతురబందుగుఁడవు హరినారాయణ కృష్ణ మా తలఁపెఱిఁగి నీవే మన్నించితి విపుడు (॥ఆతు॥) గురుకుమారులఁ దెచ్చుకొని రక్షించినయట్లు ధరలో గజరాజు నుద్ధరించినట్లు గరిమఁ జెరలుమాన్పి కాంతలఁ బెండ్లాడినట్లు సిరులతో మముఁ దెచ్చి సేవలు గైకొంటివి (॥ఆతు॥) నేరుపుననే రుకుమిణిదేవిఁ దెచ్చినయట్లు ధీరత మునిపుత్రులఁ దెచ్చినయట్లు భారమైన యహల్యశాపము మానిపినయట్లు గారవించి మము నేఁడు కరుణఁ జూచితివి (॥ఆతు॥) లంక సాధించి సీతను లలిఁ జేకొనినయట్లు తెంకికి ననిరుద్ధునిఁ దెచ్చినయట్లు అంకెల శ్రీవేంకటేశ అట్టె నీదాసులమని పొంకముగ మాపాలిటఁ బొసఁగి యేలితివి English(||pallavi||) ādurabaṁdugum̐ḍavu harinārāyaṇa kṛṣhṇa mā talam̐pĕṟim̐gi nīve manniṁchidi vibuḍu (||ādu||) gurugumārulam̐ dĕchchugŏni rakṣhiṁchinayaṭlu dharalo gajarāju nuddhariṁchinaṭlu garimam̐ jĕralumānpi kāṁtalam̐ bĕṁḍlāḍinaṭlu sirulado mamum̐ dĕchchi sevalu gaigŏṁṭivi (||ādu||) nerubunane rugumiṇidevim̐ dĕchchinayaṭlu dhīrada munibutrulam̐ dĕchchinayaṭlu bhāramaina yahalyaśhābamu mānibinayaṭlu gāraviṁchi mamu nem̐ḍu karuṇam̐ jūsidivi (||ādu||) laṁka sādhiṁchi sīdanu lalim̐ jegŏninayaṭlu tĕṁkigi naniruddhunim̐ dĕchchinayaṭlu aṁkĕla śhrīveṁkaḍeśha aṭṭĕ nīdāsulamani pŏṁkamuga mābāliḍam̐ bŏsam̐gi yelidivi