Title (Indic)ఆడుకొంటేఁ బెద్దరికమే వుండుఁ గాని WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడుకొంటేఁ బెద్దరికమే వుండుఁ గాని యీడు జోడై నన్నుఁ బాయఁ డెంతబత్తే ఇతఁడు (॥ఆడు॥) చెప్పిన నామాఁట విను సేసు నే పనులైనాను అప్పసము నామేలువాఁడై వుండునే తప్పక నాపై నానకు తానింతా జవదాఁటఁడు యెప్పుడును నామీఁద నెంతబత్తే ఇతఁడు (॥ఆడు॥) మొగమోడు నాకుఁగడు ముచ్చటలు దాఁచఁడు నగవుకైనా బొంకఁడు నాతోడను తగ నా చెలుల గంటే దయతోడ నాదరించు ఇగిరింపించు నామతి యెంతబత్తే ఇతఁడు (॥ఆడు॥) చెల్లించు నా సలిగెలు చేతికి లోనైవుండు చల్లనిచూపులఁ జూచి చనవిచ్చునే వెల్లవిరిగా నేలె శ్రీ వేంకటేశుఁ డిదె నన్ను యెల్లవారిలో నామీఁద నెంతబత్తే యితఁడు English(||pallavi||) āḍugŏṁṭem̐ bĕddarigame vuṁḍum̐ gāni yīḍu joḍai nannum̐ bāyam̐ ḍĕṁtabatte idam̐ḍu (||āḍu||) sĕppina nāmām̐ṭa vinu sesu ne panulainānu appasamu nāmeluvām̐ḍai vuṁḍune tappaga nābai nānagu tāniṁtā javadām̐ṭam̐ḍu yĕppuḍunu nāmīm̐da nĕṁtabatte idam̐ḍu (||āḍu||) mŏgamoḍu nāgum̐gaḍu muchchaḍalu dām̐sam̐ḍu nagavugainā bŏṁkam̐ḍu nādoḍanu taga nā sĕlula gaṁṭe dayadoḍa nādariṁchu igiriṁpiṁchu nāmadi yĕṁtabatte idam̐ḍu (||āḍu||) sĕlliṁchu nā saligĕlu sedigi lonaivuṁḍu sallanisūbulam̐ jūsi sanavichchune vĕllavirigā nelĕ śhrī veṁkaḍeśhum̐ ḍidĕ nannu yĕllavārilo nāmīm̐da nĕṁtabatte yidam̐ḍu