Title (Indic)ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దు గునుసుతా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడుతాఁ బాడుతా నీతో నట్టే ముద్దు గునుసుతా వోడక నీదండ చేరి వున్నారమయ్యా (॥ఆడు॥) ఆసఁ దల్లిదండ్రిమోము అట్టె చూచి శిశువులు యే సుఖదుఃఖములుఁ దా మెరఁగనట్టు వాసుల శ్రీపతి మిమ్ము వడి నాత్మఁ దలఁచుక యీసుల పుణ్యపాపము లెఱఁగమయ్యా (॥ఆడు॥) యేలినవారు వెట్టగా నేపునఁ దొత్తులు బంట్లు ఆలకించి పరుల బోయడుగనట్టు తాలిమి శ్రీపతి మీరు తగ మమ్ము రక్షించఁగా యేలని యేమియుఁ గోర నెరఁగమయ్యా (॥ఆడు॥) చేతఁ జిక్కి నిధానము చేరి యింటఁగలవాఁడు యేతులఁ గలిమిలేము లెరఁగనట్టు ఆతుమలో శ్రీవేంకటాధిప నీ వుండఁగాను యీతల నే వెలుతులు నెరఁగమయ్యా English(||pallavi||) āḍudām̐ bāḍudā nīdo naṭṭe muddu gunusudā voḍaga nīdaṁḍa seri vunnāramayyā (||āḍu||) āsam̐ dallidaṁḍrimomu aṭṭĕ sūsi śhiśhuvulu ye sukhaduḥkhamulum̐ dā mĕram̐ganaṭṭu vāsula śhrībadi mimmu vaḍi nātmam̐ dalam̐suga yīsula puṇyabābamu lĕṟam̐gamayyā (||āḍu||) yelinavāru vĕṭṭagā nebunam̐ dŏttulu baṁṭlu ālagiṁchi parula boyaḍuganaṭṭu tālimi śhrībadi mīru taga mammu rakṣhiṁcham̐gā yelani yemiyum̐ gora nĕram̐gamayyā (||āḍu||) sedam̐ jikki nidhānamu seri yiṁṭam̐galavām̐ḍu yedulam̐ galimilemu lĕram̐ganaṭṭu ādumalo śhrīveṁkaḍādhiba nī vuṁḍam̐gānu yīdala ne vĕludulu nĕram̐gamayyā