Title (Indic)ఆడినట్టే ఆడీ వీఁడు అద్దములో నీడవలె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడినట్టే ఆడీ వీఁడు అద్దములో నీడవలె జాడతోడ కన్నులనే సన్న సేసీనే (॥ఆడి॥) కోరి జలకము కేళాకూళిలో నేనాడఁగాను ఆరసి తానీఁద వచ్చీనాడకే తాను తారసిలి సిగ్గుతో నేఁ దామరమొగ్గలంటితే సారపుఁగమలాలంటాఁ జన్నులంటీనే (॥ఆడి॥) చెంది పొదరింటి లోన చీర నేఁగట్టుకోఁగాను అందిమ్మనీఁ బచ్చడము ఆడనే తాను కందువ సిగ్గుతో నేను కమ్మఁజిగురు వట్టితే ముందే నాచిగురుమోవి మోవిఁ బట్టీనే (॥ఆడి॥) అలసి నేనొకచోటనారగించఁ గూచుండితే వలెనంటా నాపొత్తుకు వచ్చీనే తాను అలరి సిగ్గుతోడ నేనట్టె చేయెత్తి మొక్కితే యెలమి శ్రీ వేంకటేశుఁడిటుగూడి మొక్కెనే English(||pallavi||) āḍinaṭṭe āḍī vīm̐ḍu addamulo nīḍavalĕ jāḍadoḍa kannulane sanna sesīne (||āḍi||) kori jalagamu keḽāgūḽilo nenāḍam̐gānu ārasi tānīm̐da vachchīnāḍage tānu tārasili siggudo nem̐ dāmaramŏggalaṁṭide sārabum̐gamalālaṁṭām̐ jannulaṁṭīne (||āḍi||) sĕṁdi pŏdariṁṭi lona sīra nem̐gaṭṭugom̐gānu aṁdimmanīm̐ bachchaḍamu āḍane tānu kaṁduva siggudo nenu kammam̐jiguru vaṭṭide muṁde nāsigurumovi movim̐ baṭṭīne (||āḍi||) alasi nenŏgasoḍanāragiṁcham̐ gūsuṁḍide valĕnaṁṭā nābŏttugu vachchīne tānu alari siggudoḍa nenaṭṭĕ seyĕtti mŏkkide yĕlami śhrī veṁkaḍeśhum̐ḍiḍugūḍi mŏkkĕne