Title (Indic)ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాదవరదుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆదిమూర్తి యీతఁడు ప్రహ్లాదవరదుఁడు యే దెసఁ జూచినాఁ దానె యీతఁడిది(?) దేవుఁడు (॥ఆది॥) నవ్వుల మోము తోడ నరసింహ రూపు తోడ జవ్వని తొడ మీఁదట సరస మాడ పువ్వుల దండలు యిరు బుజాలపై వేసుకొని వువ్విళ్ళూరఁ గొలువై వున్నాఁడు దేవుఁడు (॥ఆది॥) సంకుఁ జక్రములతోడ జమళి కోరల తోడ అంకెలఁ గటియభయహస్తా లెత్తి కంకణాలహారాలతో ఘన కిరీటము వెట్టి పొంకమైన ప్రతాపానఁ బొదిలీ నీ దేవుఁడు (॥ఆది॥) నానా దేవతల తోడ నారదాదుల తోడ గానములు వినుకొంటా గద్దెపై నుండి ఆనుక శ్రీ వేంకటాద్రి నహో బలము నందు తానకమై వరాలిచ్చీ దాసులకు దేవుఁడు English(||pallavi||) ādimūrdi yīdam̐ḍu prahlādavaradum̐ḍu ye dĕsam̐ jūsinām̐ dānĕ yīdam̐ḍidi(?) devum̐ḍu (||ādi||) navvula momu toḍa narasiṁha rūbu toḍa javvani tŏḍa mīm̐daḍa sarasa māḍa puvvula daṁḍalu yiru bujālabai vesugŏni vuvviḽḽūram̐ gŏluvai vunnām̐ḍu devum̐ḍu (||ādi||) saṁkum̐ jakramuladoḍa jamaḽi korala toḍa aṁkĕlam̐ gaḍiyabhayahastā lĕtti kaṁkaṇālahārālado ghana kirīḍamu vĕṭṭi pŏṁkamaina pradābānam̐ bŏdilī nī devum̐ḍu (||ādi||) nānā devadala toḍa nāradādula toḍa gānamulu vinugŏṁṭā gaddĕbai nuṁḍi ānuga śhrī veṁkaḍādri naho balamu naṁdu tānagamai varālichchī dāsulagu devum̐ḍu