Title (Indic)ఆదిమపూరుషుఁ డచ్యుతుఁ డచలు డనంతుఁ డమలుఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆదిమపూరుషుఁ డచ్యుతుఁ డచలు డనంతుఁ డమలుఁడు ఆదేవుఁ డీతఁడేపో హరి వేంకటవిభుఁడు (॥ఆదిమ॥) ఏకార్ణవమై ఉదకములేచిన బ్రహ్మాండములోఁ బైకొని యుండఁగ నొక వటపత్రములోపలను చేకొని పవళింపుచు నొక శిశువై వడిఁదేలాడిన- శ్రీకాంతుఁ డీతఁడేపో శ్రీవేంకటవిభుఁడు (॥ఆదిమ॥) అరుదుగ బలిమద మడఁపఁగ నాకసమంటిన రూపము సరుగన భూమింతయు నొక చరణంబున గొలచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండము నగిలించిన పరమాత్ముఁ డీతఁడేపో పతి శ్రీవేంకటవిభుఁడు (॥ఆదిమ॥) క్షీరపయోనిధి లోపల శేషుఁడు పర్యంకముగా ధారుణియును సిరియునుఁ బాదము లొత్తఁగను చేరువఁదను బ్రహ్మాదులు సేవింపఁగఁ జెలుఁవొందెడి నారాయణుఁ డితఁడే వున్నత వేంకటవిభుఁడు English(||pallavi||) ādimabūruṣhum̐ ḍachyudum̐ ḍasalu ḍanaṁtum̐ ḍamalum̐ḍu ādevum̐ ḍīdam̐ḍebo hari veṁkaḍavibhum̐ḍu (||ādima||) egārṇavamai udagamulesina brahmāṁḍamulom̐ baigŏni yuṁḍam̐ga nŏga vaḍabatramulobalanu segŏni pavaḽiṁpusu nŏga śhiśhuvai vaḍim̐delāḍina- śhrīgāṁtum̐ ḍīdam̐ḍebo śhrīveṁkaḍavibhum̐ḍu (||ādima||) aruduga balimada maḍam̐pam̐ga nāgasamaṁṭina rūbamu sarugana bhūmiṁtayu nŏga saraṇaṁbuna gŏlasi paragina pādāṁguḍamuna brahmāṁḍamu nagiliṁchina paramātmum̐ ḍīdam̐ḍebo padi śhrīveṁkaḍavibhum̐ḍu (||ādima||) kṣhīrabayonidhi lobala śheṣhum̐ḍu paryaṁkamugā dhāruṇiyunu siriyunum̐ bādamu lŏttam̐ganu seruvam̐danu brahmādulu seviṁpam̐gam̐ jĕlum̐vŏṁdĕḍi nārāyaṇum̐ ḍidam̐ḍe vunnada veṁkaḍavibhum̐ḍu