Title (Indic)ఆదిదేవుఁడనఁగ మొదల నవతరించి జలది సొచ్చి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆదిదేవుఁడనఁగ మొదల నవతరించి జలది సొచ్చి వేదములును శాస్త్రములును వెదకి తెచ్చె నీతఁడు (॥ఆది॥) వాలి తిరుగునట్టి దైత్యవరుల మోహవతులనెల్ల మూలమూలఁ ద్రోసి ముసుఁగుపాలు సేసె నీతఁడు వేలంఖ్యలైనసతుల వేడుకలలరఁజేసి వొంటి నాలిమగనిరీతిఁ గూడి యనభవించె నీతఁడు (॥ఆది॥) కడుపులోని జగములెల్లఁ గదలకుండఁ బాఁపరేని- పడుక నొక్కమనసుతోడఁ బవ్వళించె నీతఁడు అడుగుకింద లోకమెల్ల నడఁచఁదలఁచి గుఱుతుమీర పొడవు వెరిగి మిన్నుజలము పొడిచి తెచ్చె నీతఁడు (॥ఆది॥) కోడెవయసునాఁడు మంచి గోపసతుల మనములెల్ల ఆడి కెలకు నోప కొల్లలాడి బ్రదికె నీతఁడు వేడుకలర వేంకటాద్రి వెలసి భూతకోటి దన్నుఁ జూడుఁడనుచు మోక్షపదము చూరవిడిచె నీతఁడు English(||pallavi||) ādidevum̐ḍanam̐ga mŏdala navadariṁchi jaladi sŏchchi vedamulunu śhāstramulunu vĕdagi tĕchchĕ nīdam̐ḍu (||ādi||) vāli tirugunaṭṭi daityavarula mohavadulanĕlla mūlamūlam̐ drosi musum̐gubālu sesĕ nīdam̐ḍu velaṁkhyalainasadula veḍugalalaram̐jesi vŏṁṭi nālimaganirīdim̐ gūḍi yanabhaviṁchĕ nīdam̐ḍu (||ādi||) kaḍubuloni jagamulĕllam̐ gadalaguṁḍam̐ bām̐pareni- paḍuga nŏkkamanasudoḍam̐ bavvaḽiṁchĕ nīdam̐ḍu aḍugugiṁda logamĕlla naḍam̐sam̐dalam̐si guṟudumīra pŏḍavu vĕrigi minnujalamu pŏḍisi tĕchchĕ nīdam̐ḍu (||ādi||) koḍĕvayasunām̐ḍu maṁchi gobasadula manamulĕlla āḍi kĕlagu noba kŏllalāḍi bradigĕ nīdam̐ḍu veḍugalara veṁkaḍādri vĕlasi bhūdagoḍi dannum̐ jūḍum̐ḍanusu mokṣhabadamu sūraviḍisĕ nīdam̐ḍu