Title (Indic)ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడే బొమ్మలు వారు ఆడించే సూత్రము నీవు యేడో ఇన్నాళ్లు నేను ఇదెఱఁగనైతిని (॥ఆడే॥) నీవు చెప్పినబుద్దుల నెలఁతలు నడవఁగా ఆవలివారి దూరితి నయ్యా నేను చేవదేర తాలము చేయి నీచే నుండఁగాను వేవేలుచోట్లను వెదకితి నేను (॥ఆడే॥) కన్నుగీఁటి నీవు వారి కైకొని మొక్కించఁగా సన్నల వారి దొబ్బితి సాదించి నేను పన్నినకూఁకటివేరై పారి నీవు వుండఁగాను వున్నతిఁ గొనలకు నీ రొగ్గి నేఁ బోసితిని (॥ఆడే॥) కోరి పెండ్లాడిన పెండ్లి కొడకవు నీవుండఁగా గారవించితిని వారిఁ గరుణ నేను యీరీతి నన్ను శ్రీ వేంకటేశ నీవు గూడుండఁగా కారణ మిందరునంటాఁ గడల మెచ్చితిని English(||pallavi||) āḍe bŏmmalu vāru āḍiṁche sūtramu nīvu yeḍo innāḽlu nenu idĕṟam̐ganaidini (||āḍe||) nīvu sĕppinabuddula nĕlam̐talu naḍavam̐gā āvalivāri dūridi nayyā nenu sevadera tālamu seyi nīse nuṁḍam̐gānu vevelusoṭlanu vĕdagidi nenu (||āḍe||) kannugīm̐ṭi nīvu vāri kaigŏni mŏkkiṁcham̐gā sannala vāri dŏbbidi sādiṁchi nenu panninagūm̐kaḍiverai pāri nīvu vuṁḍam̐gānu vunnadim̐ gŏnalagu nī rŏggi nem̐ bosidini (||āḍe||) kori pĕṁḍlāḍina pĕṁḍli kŏḍagavu nīvuṁḍam̐gā gāraviṁchidini vārim̐ garuṇa nenu yīrīdi nannu śhrī veṁkaḍeśha nīvu gūḍuṁḍam̐gā kāraṇa miṁdarunaṁṭām̐ gaḍala mĕchchidini