Title (Indic)ఆడవయ్య సరిగా నీ వాపెతో వసంతము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడవయ్య సరిగా నీ వాపెతో వసంతము వేడుక నవ్వులలోని వెన్నెల వసంతము (॥॥) యెడయక నీమీఁద నింతి కొనచూపుల వడిఁ జల్లీ వలపుల వసంతము వుడుకుఁ జెమటలనే వూర్చి కొనగోరఁ జిమ్మీ కొడిసాగ బఱ్ఱటకొములవసంతము (॥॥) గొరబైన మాటలు కుమ్మరించి కుమ్మరించీ వరుఁస జిరు సిగ్గుల వంతము సొరిది సరసములఁ జూపి మోపి పెనఁగుచు సరుగ జాచీ గుబ్బచన్నుల వసంతము (॥॥) పొంచి పొంచి కలయుచు బుసకొట్టుసేఁతలనే వంచీ కౌఁగిటిరతుల వసంతము యెంచి శ్రీవేంకటేశ నన్నేలితివి ఆకె నీపయి నించీఁ గలయికలనే నెయ్యపువసంతము English(||pallavi||) āḍavayya sarigā nī vābĕdo vasaṁtamu veḍuga navvulaloni vĕnnĕla vasaṁtamu (||||) yĕḍayaga nīmīm̐da niṁti kŏnasūbula vaḍim̐ jallī valabula vasaṁtamu vuḍugum̐ jĕmaḍalane vūrsi kŏnagoram̐ jimmī kŏḍisāga baṭraḍagŏmulavasaṁtamu (||||) gŏrabaina māḍalu kummariṁchi kummariṁchī varum̐sa jiru siggula vaṁtamu sŏridi sarasamulam̐ jūbi mobi pĕnam̐gusu saruga jāsī gubbasannula vasaṁtamu (||||) pŏṁchi pŏṁchi kalayusu busagŏṭṭusem̐talane vaṁchī kaum̐giḍiradula vasaṁtamu yĕṁchi śhrīveṁkaḍeśha nannelidivi āgĕ nībayi niṁchīm̐ galayigalane nĕyyabuvasaṁtamu