Title (Indic)ఆటవానికివలెఁ దోడయ్యీఁ బ్రకృతి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆటవానికివలెఁ దోడయ్యీఁ బ్రకృతి గాటపు జీవుని కెంత కైవసమో ప్రకృతి (॥ఆట॥) చాటి చదివినవెల్లా సారెఁ దలంపించి యిచ్చు పాటించి యక్షిణి విద్య ప్రకృతి తేటగాఁ దొల్లిఁటి జన్మము దెచ్చి యీ జన్మాన నిచ్చు చీటికి మాటికి యిచ్చిన దిచ్చుఁ బ్రకృతి (॥ఆట॥) వొక్కచో నుండినవాని నొక్కచోఁ బొడచూపించును పక్కన పాసికవిద్య ప్రకృతి దుక్కినేలఁ జల్లిన విత్తులు కొటారు కెక్కించు వొక్కటే యనేకముగా నొనరించుఁ బ్రకృతి (॥ఆట॥) మనసులోఁ దలఁచితే మర్మములు గరఁగించు పనివడి యింద్రజాలమై ప్రకృతి ప్రకృతి యేనలేని శ్రీవేంకటేశ యీ జీవులకు పనిగొంటివి సంసారఫలము యీ ప్రకృతి English(||pallavi||) āḍavānigivalĕm̐ doḍayyīm̐ brakṛti gāḍabu jīvuni kĕṁta kaivasamo prakṛti (||āḍa||) sāḍi sadivinavĕllā sārĕm̐ dalaṁpiṁchi yichchu pāḍiṁchi yakṣhiṇi vidya prakṛti teḍagām̐ dŏllim̐ṭi janmamu dĕchchi yī janmāna nichchu sīḍigi māḍigi yichchina dichchum̐ brakṛti (||āḍa||) vŏkkaso nuṁḍinavāni nŏkkasom̐ bŏḍasūbiṁchunu pakkana pāsigavidya prakṛti dukkinelam̐ jallina vittulu kŏḍāru kĕkkiṁchu vŏkkaḍe yanegamugā nŏnariṁchum̐ brakṛti (||āḍa||) manasulom̐ dalam̐side marmamulu garam̐giṁchu panivaḍi yiṁdrajālamai prakṛti prakṛti yenaleni śhrīveṁkaḍeśha yī jīvulagu panigŏṁṭivi saṁsāraphalamu yī prakṛti