Title (Indic)ఆడరో పాడరో అష్ప(ప్స?)రోగణము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడరో పాడరో అష్ప(ప్స?)రోగణము వీడెము లిందరో విభవము నేఁడు (॥ఆడ॥) కమలారమణునికల్యాణమునకు తమినదె గరుడద్వజ మెనఁగె తెమలుచు మ్రోసెను దివ్వదుందుభులు గమనించరో దివిఁగలదేవతలు (॥ఆడ॥) వెలయఁగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో కలగొన నిచ్చేరు గంధాక్షతలవె చెలఁగి కైకోనరో శ్రీవైష్ణవులు (॥ఆడ॥) బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి అడరినతలఁబా లందెనిదె నడచీఁ బరుషలు నానాముఖముల ముడుపులు చదువరో ముయిగా నరులు English(||pallavi||) āḍaro pāḍaro aṣhpa(psa?)rogaṇamu vīḍĕmu liṁdaro vibhavamu nem̐ḍu (||āḍa||) kamalāramaṇunigalyāṇamunagu taminadĕ garuḍadvaja mĕnam̐gĕ tĕmalusu mrosĕnu divvaduṁdubhulu gamaniṁcharo divim̐galadevadalu (||āḍa||) vĕlayam̐ga lakṣhmī vibhuni pĕṁḍligini balasi aṁkurārbaṇa madivo kalagŏna nichcheru gaṁdhākṣhadalavĕ sĕlam̐gi kaigonaro śhrīvaiṣhṇavulu (||āḍa||) baḍi śhrīveṁkaḍabadigi śhrīsadigi aḍarinadalam̐bā laṁdĕnidĕ naḍasīm̐ baruṣhalu nānāmukhamula muḍubulu saduvaro muyigā narulu