Title (Indic)ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడరమ్మ పాడరమ్మ అంగనలు చూడరమ్మ వేడుకఁ బరుషలెల్ల వీధినుండరమ్మా (॥ఆడ॥) అల్లదివో వోఁగునూఁతులౌభళేశుపెద్దకోవ వెల్లి పలనీటిజాలు వెడలేసోన చల్లనిమాఁకులనీడ సంగడిమేడలవాడ యెల్లగాఁగ నరసింహుఁడేగీ నింతితోడను (॥ఆడ॥) సింగారపుమండపాల సింహాలమునిమంద- లంగపు తెల్ల గోపుర మదె మిన్నంద చెంగట నాడు వార్లు చేరి పన్నిద్దరుఁగొల్వ సంగతిఁ దాఁగొలువిచ్చీ జయనరసింహము (॥ఆడ॥) కందువ శ్రీ వేంకటేశు కల్యాణములవేది అందమై భూములకెల్లా నాదికి నాది మందల పాలకొండమలకు నట్టనడుమ విందగు దాసులతోడ విహరించీ దేవుఁడు English(||pallavi||) āḍaramma pāḍaramma aṁganalu sūḍaramma veḍugam̐ baruṣhalĕlla vīdhinuṁḍarammā (||āḍa||) alladivo vom̐gunūm̐tulaubhaḽeśhubĕddagova vĕlli palanīḍijālu vĕḍalesona sallanimām̐kulanīḍa saṁgaḍimeḍalavāḍa yĕllagām̐ga narasiṁhum̐ḍegī niṁtidoḍanu (||āḍa||) siṁgārabumaṁḍabāla siṁhālamunimaṁda- laṁgabu tĕlla gobura madĕ minnaṁda sĕṁgaḍa nāḍu vārlu seri panniddarum̐gŏlva saṁgadim̐ dām̐gŏluvichchī jayanarasiṁhamu (||āḍa||) kaṁduva śhrī veṁkaḍeśhu kalyāṇamulavedi aṁdamai bhūmulagĕllā nādigi nādi maṁdala pālagŏṁḍamalagu naṭṭanaḍuma viṁdagu dāsuladoḍa vihariṁchī devum̐ḍu