Title (Indic)ఆడరాని చూడరాని యట్టి దొర వింతే కాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడరాని చూడరాని యట్టి దొర వింతే కాక యేడ నైనఁ జెలి నీకు నేమి సేసెనయ్యా (॥ఆడ॥) కాంత నీకు సన్న సేసె కమ్మరఁ బూబంతి వేసె సంతమై మరుకాఁకల జలి గాసె చెంత నీవు చూడఁగాను సిగ్గునఁ బయ్యద మూసె యింతే కాక ఆకె నిన్ను నేమి సేసెనయ్యా (॥ఆడ॥) వలపు నీపై నించె వడిఁ బులకలు వెంచె చెలప చెమట లవె చెక్కున ముంచె నిలువు నీ చేఁతలకు నిట్టూర్పులఁ దలవంచె యెలమి నిన్నాకె మరి యేమి సేసె నయ్యా (॥ఆడ॥) నీ యెదుటఁ దాఁ బొలసె నీటున నిన్ను సొలసె కాయజకేలి నిన్నుఁ గడుఁ గలసె పాయపు శ్రీవెంకటేశ పడఁతి నీతో వెలసె యీయెడ నిందాఁక నాకె యేమి సేసెనయ్యా English(||pallavi||) āḍarāni sūḍarāni yaṭṭi dŏra viṁte kāga yeḍa nainam̐ jĕli nīgu nemi sesĕnayyā (||āḍa||) kāṁta nīgu sanna sesĕ kammaram̐ būbaṁti vesĕ saṁtamai marugām̐kala jali gāsĕ sĕṁta nīvu sūḍam̐gānu siggunam̐ bayyada mūsĕ yiṁte kāga āgĕ ninnu nemi sesĕnayyā (||āḍa||) valabu nībai niṁchĕ vaḍim̐ bulagalu vĕṁchĕ sĕlaba sĕmaḍa lavĕ sĕkkuna muṁchĕ niluvu nī sem̐talagu niṭṭūrbulam̐ dalavaṁchĕ yĕlami ninnāgĕ mari yemi sesĕ nayyā (||āḍa||) nī yĕduḍam̐ dām̐ bŏlasĕ nīḍuna ninnu sŏlasĕ kāyajageli ninnum̐ gaḍum̐ galasĕ pāyabu śhrīvĕṁkaḍeśha paḍam̐ti nīdo vĕlasĕ yīyĕḍa niṁdām̐ka nāgĕ yemi sesĕnayyā