Title (Indic)ఆడనుండేమి తగవులట్టె చెప్పేవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనుండేమి తగవులట్టె చెప్పేవు నీడల నిన్నియునాయ నీ కడమే యిఁకను (॥ఆడ॥) పలుకఁగ నేర్తువు పాదాలు గుద్దనేర్తువు సొలసి వాకిలి దెరచుక రాఁగదే అలుక దీర్చఁ గలవు ఆయములంటఁగలవు బలిమి నీపతితొడపైఁ గూచుండఁగదే (॥ఆడ॥) పగడసాలాడుదువు పక్కన నవ్వింతువు మొగము చూపీతనికి మొక్కఁగదవే పొగడుదు విచ్చెరిఁగి పొద్దులు గొంతవుత్తువు మగని ముసుఁ గుదీసి మంతనమాడఁగదే (॥ఆడ॥) వీడెము చేతికిత్తువు వెరపులు వాపుదువు తోడఁ బెండ్లి కూఁతురవై తొక్కవే కాలు యీడనె శ్రీ వేంకటేశుఁడింతలోనె నన్నుఁగూడె జాడనేనంతెరఁగను సరసమాడఁగదే English(||pallavi||) āḍanuṁḍemi tagavulaṭṭĕ sĕppevu nīḍala ninniyunāya nī kaḍame yim̐kanu (||āḍa||) palugam̐ga nerduvu pādālu guddanerduvu sŏlasi vāgili dĕrasuga rām̐gade aluga dīrsam̐ galavu āyamulaṁṭam̐galavu balimi nībadidŏḍabaim̐ gūsuṁḍam̐gade (||āḍa||) pagaḍasālāḍuduvu pakkana navviṁtuvu mŏgamu sūbīdanigi mŏkkam̐gadave pŏgaḍudu vichchĕrim̐gi pŏddulu gŏṁtavuttuvu magani musum̐ gudīsi maṁtanamāḍam̐gade (||āḍa||) vīḍĕmu sedigittuvu vĕrabulu vābuduvu toḍam̐ bĕṁḍli kūm̐turavai tŏkkave kālu yīḍanĕ śhrī veṁkaḍeśhum̐ḍiṁtalonĕ nannum̐gūḍĕ jāḍanenaṁtĕram̐ganu sarasamāḍam̐gade