Title (Indic)ఆడనుం డేమి తగవు అంది చెప్పేవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనుం డేమి తగవు అంది చెప్పేవే వాడిక లిన్నియునాయ వలపు నీకడమే (॥ఆడ॥) పలికించ నేరుతువు పాదా లొత్త నేరుతువు సొలసి వాకిలి దీసి చొచ్చి రా గదే అలుక దీర్చఁగలవు ఆయము లంటఁ గలవు బలిమి నీ పతితోడఁ బవళించఁగదవే (॥ఆడ॥) పగడసా లాడుదువు పక్కన నవ్వింతువు మొగము చూ పితనికి మొక్కఁగదవే పొగడుదు విచ్చకమై పొద్దులు గొంత పుత్తువు మగనిముఁసుగు చొచ్చి మంతనమాడఁగదే (॥ఆడ॥) వీడెము చేతి కిత్తువు వెఱపులు పాపుదువు తోడఁ బెండ్లి కూఁతురవై తొక్కవే కాలు యీడనే శ్రీవేంకటేశుఁ డిప్పు డిట్టే నన్ను గూడె జాడలనే అంతరంగసరస మాడఁగదే English(||pallavi||) āḍanuṁ ḍemi tagavu aṁdi sĕppeve vāḍiga linniyunāya valabu nīgaḍame (||āḍa||) paligiṁcha neruduvu pādā lŏtta neruduvu sŏlasi vāgili dīsi sŏchchi rā gade aluga dīrsam̐galavu āyamu laṁṭam̐ galavu balimi nī padidoḍam̐ bavaḽiṁcham̐gadave (||āḍa||) pagaḍasā lāḍuduvu pakkana navviṁtuvu mŏgamu sū pidanigi mŏkkam̐gadave pŏgaḍudu vichchagamai pŏddulu gŏṁta puttuvu maganimum̐sugu sŏchchi maṁtanamāḍam̐gade (||āḍa||) vīḍĕmu sedi kittuvu vĕṟabulu pābuduvu toḍam̐ bĕṁḍli kūm̐turavai tŏkkave kālu yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍippu ḍiṭṭe nannu gūḍĕ jāḍalane aṁtaraṁgasarasa māḍam̐gade