Title (Indic)ఆతనివల్లఁ దప్పేది అరసి చూచేనంటే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనివల్లఁ దప్పేది అరసి చూచేనంటే కాతరపు నా గుణాల గతులింతే కాక (॥ఆతని॥) చనవుమెరసి నేను సారెకు మాటలాడఁగ వినక మానీనా విభుఁడు తాను ననిచి నాపై ప్రేమ నాఁటెనో నాఁటదో యని అనుమానపు నామనసల్లాడీఁ గాక (॥ఆతని॥) వీడిన తురుముతోడ వేగమె నేమొక్కఁగాను చూడక మానీనా సుగుణ తాను వాడుదేర నన్నుఁగూడ వచ్చీనో రాఁడోయని వేడుకతోఁ దమకించే విధమింతే గాక (॥ఆతని॥) పొంకానఁ గాఁగిలించి పొఁగ నేఁగూడఁగాను లంకెగాక మానీనా శ్రీ వెంకటేశుఁడు కొంకక నా రతులియ్యకొనునో కొనఁడోయని సంకెలేని నాలో విచారమింతే కాక English(||pallavi||) ādanivallam̐ dappedi arasi sūsenaṁṭe kādarabu nā guṇāla gaduliṁte kāga (||ādani||) sanavumĕrasi nenu sārĕgu māḍalāḍam̐ga vinaga mānīnā vibhum̐ḍu tānu nanisi nābai prema nām̐ṭĕno nām̐ṭado yani anumānabu nāmanasallāḍīm̐ gāga (||ādani||) vīḍina turumudoḍa vegamĕ nemŏkkam̐gānu sūḍaga mānīnā suguṇa tānu vāḍudera nannum̐gūḍa vachchīno rām̐ḍoyani veḍugadom̐ damagiṁche vidhamiṁte gāga (||ādani||) pŏṁkānam̐ gām̐giliṁchi pŏm̐ga nem̐gūḍam̐gānu laṁkĕgāga mānīnā śhrī vĕṁkaḍeśhum̐ḍu kŏṁkaga nā raduliyyagŏnuno kŏnam̐ḍoyani saṁkĕleni nālo visāramiṁte kāga