Title (Indic)ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనినే నే కొలిచి నే నందితిఁ బో నిజసుఖము శ్రీతరుణీపతి మాయాధవుఁడు సృష్టియింతయును హరిమూలము (॥ఆత॥) కోరుదుమా దుఁఖములు కోర కేతెంచు తముఁదామే ఆరీతులనే సుఖములు యేతెంచు నందును విచారమంతేల సారేకు దైవాధీనములివి రెండు స్వయత్నములుగా వెవ్వరికి కోరేటి దొకటే హరిశరణాగతి గోవిందుఁడే యింతకు మూలము (॥ఆత॥) కమ్మంటిమా ప్రపంచము గలిగీ స్వభావము అందుకది యిమ్ముల మోక్షము యీరీతులనే యీశ్వరుఁడిచ్చిన యిది గలుగు కమ్మి అంతర్యామికల్పితంబు లివి కాదననవుననరాదెవ్వరికి సమ్మతించి ఆసపడియెడి దొకటే సర్వలోకపతి నిజదాస్యము (॥ఆత॥) సరి నెఱఁగుదుమా పోయినజన్మము సారేకు నేమేమిచేసితిమా యిరవుగ నట్లా మీదఁటిజన్మముయెఱుకలు మఱపులు యిఁకనేలా నిరతమై శ్రీవేంకటేశుఁడు తనయిచ్చ నిర్మించిన దిదియీదేహము గరిమెల నాతనికైంకర్యమెపో కలకాలము మాకు కాణాచి English(||pallavi||) ādanine ne kŏlisi ne naṁdidim̐ bo nijasukhamu śhrīdaruṇībadi māyādhavum̐ḍu sṛṣhṭiyiṁtayunu harimūlamu (||āda||) korudumā dum̐khamulu kora kedĕṁchu tamum̐dāme ārīdulane sukhamulu yedĕṁchu naṁdunu visāramaṁtela sāregu daivādhīnamulivi rĕṁḍu svayatnamulugā vĕvvarigi koreḍi dŏgaḍe hariśharaṇāgadi goviṁdum̐ḍe yiṁtagu mūlamu (||āda||) kammaṁṭimā prabaṁchamu galigī svabhāvamu aṁdugadi yimmula mokṣhamu yīrīdulane yīśhvarum̐ḍichchina yidi galugu kammi aṁtaryāmigalbidaṁbu livi kādananavunanarādĕvvarigi sammadiṁchi āsabaḍiyĕḍi dŏgaḍe sarvalogabadi nijadāsyamu (||āda||) sari nĕṟam̐gudumā poyinajanmamu sāregu nememisesidimā yiravuga naṭlā mīdam̐ṭijanmamuyĕṟugalu maṟabulu yim̐kanelā niradamai śhrīveṁkaḍeśhum̐ḍu tanayichcha nirmiṁchina didiyīdehamu garimĕla nādanigaiṁkaryamĕbo kalagālamu māgu kāṇāsi