Title (Indic)ఆతనిఁ జూడవలెఁగా అన్నిటా నేము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనిఁ జూడవలెఁగా అన్నిటా నేము చేతులొగ్గి చెప్పినట్టు సేసేమే యిఁకను (॥॥) సొరిది నాతనితోడ జోడుగూడుక వచ్చి సిరులనెమ్మెలచేత చెలరేఁగేవే దొరవౌదువంటాను తోడిసతులు మెచ్చేరు మురిపెములు గంటిమి మొక్కేమే నీకు (॥॥) పొలయుచు రాజసాన పురుషుని సలిగెల నలువంక నిఱ్ఱవీఁగి నవ్వునవ్వేవే బలువురాలవంటాను పడఁతులు పొగడేరు తెలిసితిమి పట్టపుదేవులవే నీవు (॥॥) కూరిమిశ్రీ వేంకటేశుఁ గూడినసంతోసాన మేరమీరి యందరికి మేలు చూపేవే యీరీతి నీతనిచేత నేలించితనే రిందరు ఆరయ నలమేల్మంగ వౌదువే మన్ననల English(||pallavi||) ādanim̐ jūḍavalĕm̐gā anniḍā nemu sedulŏggi sĕppinaṭṭu seseme yim̐kanu (||||) sŏridi nādanidoḍa joḍugūḍuga vachchi sirulanĕmmĕlaseda sĕlarem̐geve dŏravauduvaṁṭānu toḍisadulu mĕchcheru muribĕmulu gaṁṭimi mŏkkeme nīgu (||||) pŏlayusu rājasāna puruṣhuni saligĕla naluvaṁka niṭravīm̐gi navvunavveve baluvurālavaṁṭānu paḍam̐tulu pŏgaḍeru tĕlisidimi paṭṭabudevulave nīvu (||||) kūrimiśhrī veṁkaḍeśhum̐ gūḍinasaṁtosāna meramīri yaṁdarigi melu sūbeve yīrīdi nīdaniseda neliṁchidane riṁdaru āraya nalamelmaṁga vauduve mannanala