Title (Indic)ఆతనిఁ గొసరకురే అందేమున్నది WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనిఁ గొసరకురే అందేమున్నది ఆతుమలో సరివచ్చె నందేమున్నది (॥ఆతని॥) చాయపాటుమాఁటలెల్ల చవిసేసుకొంటగాక ఆయడఁ దప్పువట్టితే అందేమున్నది శేయరానిచేఁత చూచి సెలవి నవ్వుటగాక ఆయరత దిద్దఁబోతే అందేమున్నది (॥ఆతని॥) ఒలిసి నొల్లని వలపొడిఁ బెట్టుకొంటగాక అలిగి సొలయఁబోతే అందేమున్నది బలిమి చుట్టరికము పైఁబొదుగుటగాక అలరి విచ్చి చూచితే నందేమున్నది (॥ఆతని॥) ఎగసక్కేలేమి గల్లా యెదఁబెట్టుకొంటగాక అగడు శాయఁబోతే నందేమున్నది నిగిడి శ్రీ వెంకటాద్రి నిలయుఁడే నన్నుఁగూడె అగపడ్డ మీఁద నేరాలందేమున్నది English(||pallavi||) ādanim̐ gŏsaragure aṁdemunnadi ādumalo sarivachchĕ naṁdemunnadi (||ādani||) sāyabāḍumām̐ṭalĕlla savisesugŏṁṭagāga āyaḍam̐ dappuvaṭṭide aṁdemunnadi śheyarānisem̐ta sūsi sĕlavi navvuḍagāga āyarada diddam̐bode aṁdemunnadi (||ādani||) ŏlisi nŏllani valabŏḍim̐ bĕṭṭugŏṁṭagāga aligi sŏlayam̐bode aṁdemunnadi balimi suṭṭarigamu paim̐bŏduguḍagāga alari vichchi sūside naṁdemunnadi (||ādani||) ĕgasakkelemi gallā yĕdam̐bĕṭṭugŏṁṭagāga agaḍu śhāyam̐bode naṁdemunnadi nigiḍi śhrī vĕṁkaḍādri nilayum̐ḍe nannum̐gūḍĕ agabaḍḍa mīm̐da nerālaṁdemunnadi