Title (Indic)ఆతనిఁ గూడినప్పుడే అన్నియు సాదించవమ్మా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనిఁ గూడినప్పుడే అన్నియు సాదించవమ్మా రాతిరాయ నిఁకనైనా రమ్మనవమ్మా (॥॥) అంపినమాట కుత్తర మానతియ్యవమ్మా వంపుమోముతో నలుక వలదమ్మా పంపుడుచెలుల మింతే పలుక విదేమమ్మ చెంప జారినతురుము చెరుగుకోవమ్మా (॥॥) తమకించే పతితో నీతలఁపు లేమందుమమ్మ కొమరుఁ జూపులలోన కోపమేలమ్మా జమళి నిద్దరి కూడిగములవారమమ్మ చెమరించే మేనెల్లాఁ జిన్నఁ బోకువమ్మా (॥॥) యెదురుగా వచ్చు నాతఁ డిట్టె మమ్మంపవమ్మ కదిసితి విఁత నీకుఁ గడుమేలమ్మా యెదుట శ్రీవేంకటేశుఁ డేఁగివచ్చి నిన్నుఁ గూడె వదలఁడు దిన మిట్టె వచ్చీ నోయమ్మా English(||pallavi||) ādanim̐ gūḍinappuḍe anniyu sādiṁchavammā rādirāya nim̐kanainā rammanavammā (||||) aṁpinamāḍa kuttara mānadiyyavammā vaṁpumomudo naluga valadammā paṁpuḍusĕlula miṁte paluga videmamma sĕṁpa jārinadurumu sĕrugugovammā (||||) tamagiṁche padido nīdalam̐pu lemaṁdumamma kŏmarum̐ jūbulalona kobamelammā jamaḽi niddari kūḍigamulavāramamma sĕmariṁche menĕllām̐ jinnam̐ boguvammā (||||) yĕdurugā vachchu nādam̐ ḍiṭṭĕ mammaṁpavamma kadisidi vim̐ta nīgum̐ gaḍumelammā yĕduḍa śhrīveṁkaḍeśhum̐ ḍem̐givachchi ninnum̐ gūḍĕ vadalam̐ḍu dina miṭṭĕ vachchī noyammā