Title (Indic)ఆతనిఁ బో పొగడేము ఆతని శరణంటిమి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనిఁ బో పొగడేము ఆతని శరణంటిమి ఆతఁడే సర్వజీవుల అంతర్యామి (॥ఆత॥) పెక్కు బ్రహ్మాండకోట్లు పెక్కు బ్రహ్మకోట్లు పెక్కు రుద్రకోట్లును పెక్కు యింద్రులు వొక్కొక్క రోమకూపాల నొగి నించుకుండునట్టి వొక్కఁడే విష్ణుఁడు వీఁడే వున్నతోన్నతుఁడు (॥ఆత॥) అనంత సూర్యచంద్రులు అనంత వాయువులును అనంత నక్షత్రము లనంత మేరువులు కొనలు సాగీ నన్నిటి కూటువఁ గూడుకొన్నట్టి అనంతుఁడొక్కఁడే మించీ నాదిమూరితి (॥ఆత॥) అసంఖ్యమహిమలను అసంఖ్యమాయలు అసంఖ్యశక్తులు వరాలసంఖ్యములు పొసఁగ నిన్నిటిఁ దానే పుట్టించి రక్షించినట్టి అసంఖ్యాతుఁడు శ్రీవేంకటాద్రీశుఁడు English(||pallavi||) ādanim̐ bo pŏgaḍemu ādani śharaṇaṁṭimi ādam̐ḍe sarvajīvula aṁtaryāmi (||āda||) pĕkku brahmāṁḍagoṭlu pĕkku brahmagoṭlu pĕkku rudragoṭlunu pĕkku yiṁdrulu vŏkkŏkka romagūbāla nŏgi niṁchuguṁḍunaṭṭi vŏkkam̐ḍe viṣhṇum̐ḍu vīm̐ḍe vunnadonnadum̐ḍu (||āda||) anaṁta sūryasaṁdrulu anaṁta vāyuvulunu anaṁta nakṣhatramu lanaṁta meruvulu kŏnalu sāgī nanniḍi kūḍuvam̐ gūḍugŏnnaṭṭi anaṁtum̐ḍŏkkam̐ḍe miṁchī nādimūridi (||āda||) asaṁkhyamahimalanu asaṁkhyamāyalu asaṁkhyaśhaktulu varālasaṁkhyamulu pŏsam̐ga ninniḍim̐ dāne puṭṭiṁchi rakṣhiṁchinaṭṭi asaṁkhyādum̐ḍu śhrīveṁkaḍādrīśhum̐ḍu