Title (Indic)ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనికి నీవు మేలు ఆతఁడు నీకు మేలు చేతులెత్తి మొక్కి ఇట్టె సేవసేయవే (॥ఆత॥) మనసు లెడసినాను మంచిమాఁటలె మేలు ననుచకుండినాను వినయమే మేలు పెనఁగులాడినాను ప్రేమపు నవ్వులే మేలు అనిశము పతితోడ నాఁటదానికి (॥ఆత॥) కోపము గలిగినాను కొసరుఁజూపులె మేలు తోపు నూపుడైనా సంతోసాలే మేలు రాఁపు లెక్కడైనా నూరకె వోరుచుటే మేలు చేపట్టిన పతితోడ చెలియకును (॥ఆత॥) వేవేలు నేరములైనా వేడుకతో నుంటే మేలు కావరించు యొరసినా కాఁగిలే మేలు భావించి నిన్నేలినాఁడు పట్టపుదేవులఁజేసి శ్రీవేంకటపతి మేలు చేరీ మగువ నీకు English(||pallavi||) ādanigi nīvu melu ādam̐ḍu nīgu melu sedulĕtti mŏkki iṭṭĕ sevaseyave (||āda||) manasu lĕḍasinānu maṁchimām̐ṭalĕ melu nanusaguṁḍinānu vinayame melu pĕnam̐gulāḍinānu premabu navvule melu aniśhamu padidoḍa nām̐ṭadānigi (||āda||) kobamu galiginānu kŏsarum̐jūbulĕ melu tobu nūbuḍainā saṁtosāle melu rām̐pu lĕkkaḍainā nūragĕ vorusuḍe melu sebaṭṭina padidoḍa sĕliyagunu (||āda||) vevelu neramulainā veḍugado nuṁṭe melu kāvariṁchu yŏrasinā kām̐gile melu bhāviṁchi ninnelinām̐ḍu paṭṭabudevulam̐jesi śhrīveṁkaḍabadi melu serī maguva nīgu