Title (Indic)ఆతనితో నీమాటే అనరమ్మ చెలులు చే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనితో నీమాటే అనరమ్మ చెలులు చే- చేత నేనే అనేనంటే సిగ్గయ్యీ నాకూ (॥॥) వలుపే నాకుఁ గలిగితే వద్ద నాతఁ డుండఁడా వెలయునా బత్తి యిదె వెఱ్ఱి గాఁబోలు నలి నేనే ఆల నైతే నాతో నాతఁడు నవ్వఁడా బలిమినేఁ బిలిచేది భ్రమ గాఁబోలు (॥॥) సేసే తనకు నోమితే నిలిచి మాటాడఁడా పూనిన నామేని కాఁక బొంకు గాఁబోలు తానే నే నని యుంటే తల యెత్తి చూడఁడా మాననీ నా యడియాస మంకు గాఁబోలు (॥॥) తను మెప్పించ నేర్చితే దయ నాపైఁ జేయఁడా చనవరి నే నైనది సట గాఁబోలు పని వడి శ్రీ వేంకటపతి నన్ను నేఁడు గూడె మనికైన యీ రతులు మన్నన గాఁబోలు English(||pallavi||) ādanido nīmāḍe anaramma sĕlulu se- seda nene anenaṁṭe siggayyī nāgū (||||) valube nāgum̐ galigide vadda nādam̐ ḍuṁḍam̐ḍā vĕlayunā batti yidĕ vĕṭri gām̐bolu nali nene āla naide nādo nādam̐ḍu navvam̐ḍā baliminem̐ bilisedi bhrama gām̐bolu (||||) sese tanagu nomide nilisi māḍāḍam̐ḍā pūnina nāmeni kām̐ka bŏṁku gām̐bolu tāne ne nani yuṁṭe tala yĕtti sūḍam̐ḍā mānanī nā yaḍiyāsa maṁku gām̐bolu (||||) tanu mĕppiṁcha nerside daya nābaim̐ jeyam̐ḍā sanavari ne nainadi saḍa gām̐bolu pani vaḍi śhrī veṁkaḍabadi nannu nem̐ḍu gūḍĕ manigaina yī radulu mannana gām̐bolu