Title (Indic)ఆతనిపై పరాకే అతివకు ఘనమాయె WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనిపై పరాకే అతివకు ఘనమాయె చేతుల నాకెకు సన్న సేయరే చెలులూ (॥ఆత॥) తూఁగుమంచముపై నుండి తొయ్యలి పతిరాకకు కాఁగిన తమకముతో గక్కన లేచె వేఁగుగుఁ దురుము జారి విరు లొక్కొక్కటే రాలి మూఁగీఁ దుమ్మిదలు చక్క ముడువరే చెలులు (॥ఆత॥) అంగన ఉయ్యోలమీఁదఁ నంతలో నాతనిఁ బెట్టి బంగారుచేరులు చేతఁ బట్టి వూఁచీని జంగాళమై చేలదూఁగి జడిగొనీఁ జెమటలు చెంగట నెచ్చరికగాఁ జెప్పరే చెలులు (॥ఆత॥) శ్రీవేంకటేశ్వరుఁడే చేయి వట్టి తీసుకోఁగా కైవసమై యాతనిసంగడిఁ గూచుండె భావము లొక్కటే యాయెఁ బతికిని సతికిని యీవేళ వాకిట నుంద మిటు రారే చెలులు English(||pallavi||) ādanibai parāge adivagu ghanamāyĕ sedula nāgĕgu sanna seyare sĕlulū (||āda||) tūm̐gumaṁchamubai nuṁḍi tŏyyali padirāgagu kām̐gina tamagamudo gakkana lesĕ vem̐gugum̐ durumu jāri viru lŏkkŏkkaḍe rāli mūm̐gīm̐ dummidalu sakka muḍuvare sĕlulu (||āda||) aṁgana uyyolamīm̐dam̐ naṁtalo nādanim̐ bĕṭṭi baṁgāruserulu sedam̐ baṭṭi vūm̐sīni jaṁgāḽamai seladūm̐gi jaḍigŏnīm̐ jĕmaḍalu sĕṁgaḍa nĕchcharigagām̐ jĕppare sĕlulu (||āda||) śhrīveṁkaḍeśhvarum̐ḍe seyi vaṭṭi tīsugom̐gā kaivasamai yādanisaṁgaḍim̐ gūsuṁḍĕ bhāvamu lŏkkaḍe yāyĕm̐ badigini sadigini yīveḽa vāgiḍa nuṁda miḍu rāre sĕlulu