Title (Indic)ఆతనిపై నలిగేనా ఆతఁడు నాకలిగీనా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతనిపై నలిగేనా ఆతఁడు నాకలిగీనా కాతరాన మీరేల కక్కసపెట్టేరే (॥॥) మాటలలోనా నతఁడేమనసులోనా నతఁడే యేఁటికి విభుని దూరే రింకా మీరు కూటమికిఁ దాఁ జిత్తము కొలఁదినే వచ్చీఁగాక పాటించి యింతేసి యేల బలిమిసేసేరే (॥॥) కలలో విచ్చేసినాఁడు కరఁగించి కూడినాఁడు యెలయించేల పిలిచే రింకా మీరు తలఁపుఁదలపు నొక్కతారుకాణ లిద్దరికి చెలఁ గెప్పుడు వచ్చినాఁ జింతించనేఁటికే (॥॥) మెట్టిననే లొక్కటే మీఁదఁ బారేగా లొక్కటే యెట్టివారు గలిగితిరే యింకా మీరు యిట్టె శ్రీ వేంకటేశుఁ డిచ్చగించి నన్నుఁ గూడె గట్టిగా నితనిమతి కంటిరటే యిఁకను English(||pallavi||) ādanibai naligenā ādam̐ḍu nāgaligīnā kādarāna mīrela kakkasabĕṭṭere (||||) māḍalalonā nadam̐ḍemanasulonā nadam̐ḍe yem̐ṭigi vibhuni dūre riṁkā mīru kūḍamigim̐ dām̐ jittamu kŏlam̐dine vachchīm̐gāga pāḍiṁchi yiṁtesi yela balimisesere (||||) kalalo vichchesinām̐ḍu karam̐giṁchi kūḍinām̐ḍu yĕlayiṁchela pilise riṁkā mīru talam̐pum̐dalabu nŏkkadārugāṇa liddarigi sĕlam̐ gĕppuḍu vachchinām̐ jiṁtiṁchanem̐ṭige (||||) mĕṭṭinane lŏkkaḍe mīm̐dam̐ bāregā lŏkkaḍe yĕṭṭivāru galigidire yiṁkā mīru yiṭṭĕ śhrī veṁkaḍeśhum̐ ḍichchagiṁchi nannum̐ gūḍĕ gaṭṭigā nidanimadi kaṁṭiraḍe yim̐kanu