Title (Indic)ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని యిచ్చలోదాన నన్నిటా నేను కాతరించవద్దు నన్నుఁ గరుణించీఁ దానే (॥ఆత॥) చేరి యాతనికుణాలే చెలులాల పొగడరే దూరకురే సారె సారె తొయ్యలులాల కోరి కోరి వినయాన గుట్టుతోడ వేఁడుకొనరే బీరానఁ కొంగువట్టి పెనఁగకురే (॥ఆత॥) ఆసలఁ గాచుకుండరే యవసరమైనదాఁకా వేసటలు చూపకురే వేలఁదూలాల రాసికెక్కి వినయాన రమ్మని పిలువరే గాసిఁబెట్టి గొబ్బునఁ గక్కసించకురే (॥ఆత॥) కలపుకో లెఱిఁగించి కాలుకలే యాయరే చలపట్టకురే మీరు సతులాల చెలఁగి తానే వచ్చి శ్రీవేంకేశుఁడే కూడె బలిమి నింకా నతని పై పైఁ గొసరకురే English(||pallavi||) ādani yichchalodāna nanniḍā nenu kādariṁchavaddu nannum̐ garuṇiṁchīm̐ dāne (||āda||) seri yādaniguṇāle sĕlulāla pŏgaḍare dūragure sārĕ sārĕ tŏyyalulāla kori kori vinayāna guṭṭudoḍa vem̐ḍugŏnare bīrānam̐ kŏṁguvaṭṭi pĕnam̐gagure (||āda||) āsalam̐ gāsuguṁḍare yavasaramainadām̐kā vesaḍalu sūbagure velam̐dūlāla rāsigĕkki vinayāna rammani piluvare gāsim̐bĕṭṭi gŏbbunam̐ gakkasiṁchagure (||āda||) kalabugo lĕṟim̐giṁchi kālugale yāyare salabaṭṭagure mīru sadulāla sĕlam̐gi tāne vachchi śhrīveṁkeśhum̐ḍe kūḍĕ balimi niṁkā nadani pai paim̐ gŏsaragure