Title (Indic)ఆతని వద్ది కంపితే నన్నీ గడించుకొంటివి WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని వద్ది కంపితే నన్నీ గడించుకొంటివి యీతలఁ జెప్పవే మాకు ఇఁకనేల దాఁచను (॥ఆత॥) వన్నెల నీమోవిమీఁదివసివా ళ్ళెక్కడివే యెన్నరానిమోవికళ లెక్కడివే సన్నపుఁ జెక్కులమీఁది జారుఁజెమ టెక్కడిదే యెన్నఁడూ లేని గురుతు లిప్పుడిట్టె కంటిమి (॥ఆత॥) తేలింపుఁ జూపుఁ గన్నులతేట లివి యెక్కడివే యేలాటపుచిరుసిగ్గు లెక్కడివే నాలితనపు సెలవినవ్వు లివి యెక్కడివే యాలీల నీగురుతు లిన్నీ నేఁడు గంటిమి (॥ఆత॥) పచ్చిదొలఁకేటి మేనిభావము లివెక్కడివే హెచ్చిననీసంతోసము లెక్కడివే యిచ్చటికి వచ్చి నన్ను నేలె శ్రీవేంకటేశుఁడు యిచ్చకపు నీ గుఱుతు లివీఁ గొన్ని గంటి మి English(||pallavi||) ādani vaddi kaṁpide nannī gaḍiṁchugŏṁṭivi yīdalam̐ jĕppave māgu im̐kanela dām̐sanu (||āda||) vannĕla nīmovimīm̐divasivā ḽḽĕkkaḍive yĕnnarānimovigaḽa lĕkkaḍive sannabum̐ jĕkkulamīm̐di jārum̐jĕma ṭĕkkaḍide yĕnnam̐ḍū leni gurudu lippuḍiṭṭĕ kaṁṭimi (||āda||) teliṁpum̐ jūbum̐ gannuladeḍa livi yĕkkaḍive yelāḍabusirusiggu lĕkkaḍive nālidanabu sĕlavinavvu livi yĕkkaḍive yālīla nīgurudu linnī nem̐ḍu gaṁṭimi (||āda||) pachchidŏlam̐keḍi menibhāvamu livĕkkaḍive hĕchchinanīsaṁtosamu lĕkkaḍive yichchaḍigi vachchi nannu nelĕ śhrīveṁkaḍeśhum̐ḍu yichchagabu nī guṟudu livīm̐ gŏnni gaṁṭi mi