Title (Indic)ఆతని తలఁపు మీరే అడుగరే చెలులాల WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని తలఁపు మీరే అడుగరే చెలులాల కాతరములేని సిగ్గరిదాన నేను (॥ఆత॥) మలసి యాతనితోను మారుమాటాడేనటవే తలకొన్న మొగమోటదానను నేను కలువలఁ దాఁకవేసి గద్దించేనటవే నలువంక మెత్తని మనసుదానను నేను (॥ఆత॥) జఱసి యతని జంకించఁగఁ గలనటవే తఱితోడ వలచినదానను నేను వెఱవక చెయివట్టి వెసఁ దియ్యగలనటే కఱకరిలేని యిచ్చకపుదాన నేను (॥ఆత॥) అంచల నాసలు చూపి యలయించేనటవే మంచితలఁపలమేలుమంగను నేను ఇంచుకంతా శ్రీ వెంకటేశు మీరేనటవే వంచనసేయని చనవరిదాన నేను English(||pallavi||) ādani talam̐pu mīre aḍugare sĕlulāla kādaramuleni siggaridāna nenu (||āda||) malasi yādanidonu mārumāḍāḍenaḍave talagŏnna mŏgamoḍadānanu nenu kaluvalam̐ dām̐kavesi gaddiṁchenaḍave naluvaṁka mĕttani manasudānanu nenu (||āda||) jaṟasi yadani jaṁkiṁcham̐gam̐ galanaḍave taṟidoḍa valasinadānanu nenu vĕṟavaga sĕyivaṭṭi vĕsam̐ diyyagalanaḍe kaṟagarileni yichchagabudāna nenu (||āda||) aṁchala nāsalu sūbi yalayiṁchenaḍave maṁchidalam̐palamelumaṁganu nenu iṁchugaṁtā śhrī vĕṁkaḍeśhu mīrenaḍave vaṁchanaseyani sanavaridāna nenu