Title (Indic)ఆతని చిత్తము వచ్చినట్టే మెలఁగవద్దా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని చిత్తము వచ్చినట్టే మెలఁగవద్దా కాతరించి మరి యాల కక్కసించేవే (॥ఆత॥) వలపుగలవారికి వాసులేమీ నెంచరాదు పిలిచితే నౌఁగాదని పెనఁగరాదు మలసి యెవ్వతెతోనో మాఁటలాడె నాతఁడంటా చలపట్టి పతినేల సాదించేవే (॥ఆత॥) చుట్టరిక మమరితే సూళ్ళువెదకరాదు పట్టి కాఁగిలించుకొంటే పాయఁగరాదు తొట్టి వూడిగపుదానితో నాతఁడు నవ్వెనంటా ఇట్టె రమణుని నేరాలేల యెంచేవే (॥ఆత॥) వావులు గలసితేనే వోద్దని తోయఁగరాదు వోవరిలోఁ గూడె నిన్ను వొడ్డుకోరాదు సోవగాఁ బొరుగు సతిఁ జూచి చన్నులంటెనంటా శ్రీవేంకటేశ్వరు నేల చెక్కు నొక్కేవే English(||pallavi||) ādani sittamu vachchinaṭṭe mĕlam̐gavaddā kādariṁchi mari yāla kakkasiṁcheve (||āda||) valabugalavārigi vāsulemī nĕṁcharādu piliside naum̐gādani pĕnam̐garādu malasi yĕvvadĕdono mām̐ṭalāḍĕ nādam̐ḍaṁṭā salabaṭṭi padinela sādiṁcheve (||āda||) suṭṭariga mamaride sūḽḽuvĕdagarādu paṭṭi kām̐giliṁchugŏṁṭe pāyam̐garādu tŏṭṭi vūḍigabudānido nādam̐ḍu navvĕnaṁṭā iṭṭĕ ramaṇuni nerālela yĕṁcheve (||āda||) vāvulu galasidene voddani toyam̐garādu vovarilom̐ gūḍĕ ninnu vŏḍḍugorādu sovagām̐ bŏrugu sadim̐ jūsi sannulaṁṭĕnaṁṭā śhrīveṁkaḍeśhvaru nela sĕkku nŏkkeve