Title (Indic)ఆతని చిత్తము వచ్చినదే పదివేలుగాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని చిత్తము వచ్చినదే పదివేలుగాక చేతులెత్తి మొక్కే నేను చిత్తగించుమనవే (॥ఆత॥) చెల్లుబడి గలిగితే చెనకి కొసరవలె వొల్లనే కొంకితే నూరకుండవలెను పల్లదాన రమణుని బలిమి సేసితేను యెల్లవారూ నాఁట దాని నెంత గయ్యాళెనరా (॥ఆత॥) మన్ననలు సతమైతే మాఁటలెల్లా నాడవలె విన్నప మందకుండితే విడువవలె సన్నకు లోఁగానివాని సాదించఁజూచితేను కన్నవారెల్లా నెంత గబ్బి యిది యనరా (॥ఆత॥) మనసు చిమ్మిరేఁగితే మచ్చికతో నవ్వవలె తనిసితే నివ్వెరగందఁగవలెనూ యెనసిన శ్రీవేంకటేశుతోఁ బెనఁగితేను వినినవారెల్లా నన్ను వేసాలది యనరా English(||pallavi||) ādani sittamu vachchinade padivelugāga sedulĕtti mŏkke nenu sittagiṁchumanave (||āda||) sĕllubaḍi galigide sĕnagi kŏsaravalĕ vŏllane kŏṁkide nūraguṁḍavalĕnu palladāna ramaṇuni balimi sesidenu yĕllavārū nām̐ṭa dāni nĕṁta gayyāḽĕnarā (||āda||) mannanalu sadamaide mām̐ṭalĕllā nāḍavalĕ vinnaba maṁdaguṁḍide viḍuvavalĕ sannagu lom̐gānivāni sādiṁcham̐jūsidenu kannavārĕllā nĕṁta gabbi yidi yanarā (||āda||) manasu simmirem̐gide machchigado navvavalĕ taniside nivvĕragaṁdam̐gavalĕnū yĕnasina śhrīveṁkaḍeśhudom̐ bĕnam̐gidenu vininavārĕllā nannu vesāladi yanarā