Title (Indic)ఆతని చిత్త మెఱిఁగీ అని విన్నవించవే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని చిత్త మెఱిఁగీ అని విన్నవించవే కాతరించి కొసరితే కడుఁ జవు లౌనా (॥ఆతని॥) చనవుగలపాటినే సరలమాడుత గాక వినవే వెగ్గళమైతే వెగటు గాదా మనసువచ్చినరీతి మచ్చికె చల్లుత గాక ననచని సుద్దు లెల్లా నగుఁబాటు గాదా (॥ఆతని॥) తగవు నడపితేనే తడవుటా మేలు గాక అగడైతే వలపు వాయకు వచ్చునా మొగము చూచితేను మొక్కఁగ నమరుఁ గాక నొగియనిచోటను చోట్లు వెదకుదురా (॥ఆతని॥) కమ్మి చేతికి లోనైతే కౌఁగిలించుకొంట గాక వుమ్మడి నూరకుండితే వొగరు గాదా యిమ్ముల శ్రీవేంకటేశుఁ డే నలమేల్మంగను సమ్మతించ నన్ను నేలే సాదించవచ్చును English(||pallavi||) ādani sitta mĕṟim̐gī ani vinnaviṁchave kādariṁchi kŏsaride kaḍum̐ javu launā (||ādani||) sanavugalabāḍine saralamāḍuda gāga vinave vĕggaḽamaide vĕgaḍu gādā manasuvachchinarīdi machchigĕ salluda gāga nanasani suddu lĕllā nagum̐bāḍu gādā (||ādani||) tagavu naḍabidene taḍavuḍā melu gāga agaḍaide valabu vāyagu vachchunā mŏgamu sūsidenu mŏkkam̐ga namarum̐ gāga nŏgiyanisoḍanu soṭlu vĕdagudurā (||ādani||) kammi sedigi lonaide kaum̐giliṁchugŏṁṭa gāga vummaḍi nūraguṁḍide vŏgaru gādā yimmula śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelmaṁganu sammadiṁcha nannu nele sādiṁchavachchunu