Title (Indic)ఆతని పట్టుకు మీరు ఆడినట్టే ఆడరే WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని పట్టుకు మీరు ఆడినట్టే ఆడరే పోతరించి మిమ్ము సారెఁ బొగడీఁ దాను (॥ఆత॥) తగవులు చెప్పి రే తరుణులాల పతికి అగపడి మిమ్ముఁ గోరి యడగీని మొగ మోడి యుండరే ముందరి కాతనితోడ పగటున నే నెట్టైన బగికేఁ గాని (॥ఆత॥) ముందుముందే మెచ్చరే మొగి నాతనిచేఁతలు చెంది తనయెమ్మెలెల్లాఁ జెప్పీ మీకు చందపుబాస సేయరే సాకి రిట్టె చెప్పేమంటా కిందుపడి నే నెట్టైనా గెటిచేఁ గాని (॥ఆత॥) యిచ్చగించి నగరే యీతనిసుద్దులకెల్ల చెచ్చెరఁ గడుఁ బ్రియాలు సేసిఁ దాను అచ్చమై శ్రీ వేంకటేశుఁ డాతఁడె నన్నుఁ గలసె పచ్చిగా నే నిఁకఁ దనపాల నుండేఁ గాని English(||pallavi||) ādani paṭṭugu mīru āḍinaṭṭe āḍare podariṁchi mimmu sārĕm̐ bŏgaḍīm̐ dānu (||āda||) tagavulu sĕppi re taruṇulāla padigi agabaḍi mimmum̐ gori yaḍagīni mŏga moḍi yuṁḍare muṁdari kādanidoḍa pagaḍuna ne nĕṭṭaina bagigem̐ gāni (||āda||) muṁdumuṁde mĕchchare mŏgi nādanisem̐talu sĕṁdi tanayĕmmĕlĕllām̐ jĕppī mīgu saṁdabubāsa seyare sāgi riṭṭĕ sĕppemaṁṭā kiṁdubaḍi ne nĕṭṭainā gĕḍisem̐ gāni (||āda||) yichchagiṁchi nagare yīdanisuddulagĕlla sĕchchĕram̐ gaḍum̐ briyālu sesim̐ dānu achchamai śhrī veṁkaḍeśhum̐ ḍādam̐ḍĕ nannum̐ galasĕ pachchigā ne nim̐kam̐ danabāla nuṁḍem̐ gāni