Title (Indic)ఆతని నిక్కడికే రమ్మనే మమ్మా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని నిక్కడికే రమ్మనే మమ్మా యేతులకు మరేమన్నా నెఱఁగ మమ్మా (॥॥) కన్నెరో విరహముతో కాంతునింటి కేఁగె నంటా యెన్నుకొని యిల్లు వెళ్ళి యేఁగకు వమ్మా వెన్నెల యెండలు దాఁ కి వేసవి యెంత సేసునో యిన్నేసి సాహసాలకు నెఱఁగ మమ్మా (॥॥) ఆతఁడురానికాఁకలు ఆఁపలేక వొకతెవె యీతల వనములోని కేఁగకు వమ్మా పోతరించి కోవిలల భూతము లందుఁ గలవు యీ తలఁపు దలఁచేవు యెఱఁగ మమ్మా (॥॥) అలమేల్మంగ శ్రీ వేంకటప్ప డిట్టే నిన్నుఁ గూడె యెలమి మేడమీఁదికి నేఁగకు వమ్మా చిలుకలు మీ చేఁతలు సిగ్గులు దోఁచఁగ నాడీ ఇలమీఁద నింత కాఁకు యెఱఁగ మమ్మా. English(||pallavi||) ādani nikkaḍige rammane mammā yedulagu maremannā nĕṟam̐ga mammā (||||) kannĕro virahamudo kāṁtuniṁṭi kem̐gĕ naṁṭā yĕnnugŏni yillu vĕḽḽi yem̐gagu vammā vĕnnĕla yĕṁḍalu dām̐ ki vesavi yĕṁta sesuno yinnesi sāhasālagu nĕṟam̐ga mammā (||||) ādam̐ḍurānigām̐kalu ām̐palega vŏgadĕvĕ yīdala vanamuloni kem̐gagu vammā podariṁchi kovilala bhūdamu laṁdum̐ galavu yī talam̐pu dalam̐sevu yĕṟam̐ga mammā (||||) alamelmaṁga śhrī veṁkaḍappa ḍiṭṭe ninnum̐ gūḍĕ yĕlami meḍamīm̐digi nem̐gagu vammā silugalu mī sem̐talu siggulu dom̐sam̐ga nāḍī ilamīm̐da niṁta kām̐ku yĕṟam̐ga mammā.