Title (Indic)ఆతని నేల దూరేవే అప్పటి నీవు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని నేల దూరేవే అప్పటి నీవు నీతులు చెప్పఁబోయిన నెరుసులే యెంతురు (॥ఆత॥) వొరులఁ దడవకున్న వొచ్చము లేక వుండిన సరుఁస బలుకుదురు సవతివారు పురుషుఁ డందుకుఁగాను పూనుక తా వచ్చినాను వెరవు దెలియుదాఁకా వెండేలే యాడుదురు (॥ఆత॥) తమఇంటనే వుండన తగవుతో నడచిన జమళినే సాదింతురు సంగడివారు రమణుఁ డందుకుఁగాను రాఁపుగా నడ్డమాడిన అమరని కాఁకతోడ నగ్గల మాడుదురు (॥ఆత॥) ఇచ్చకమే సేసినాను యెరవు లేకుండినాను వచ్చివచ్చి మీరుదురు వంతులవారు నిచ్చ శ్రీవేంకటేశుఁడు నిన్నుఁ బాయకిట్లుండె విచ్చనవిడి నాతని వేవేలు నాడుదురు English(||pallavi||) ādani nela dūreve appaḍi nīvu nīdulu sĕppam̐boyina nĕrusule yĕṁturu (||āda||) vŏrulam̐ daḍavagunna vŏchchamu lega vuṁḍina sarum̐sa baluguduru savadivāru puruṣhum̐ ḍaṁdugum̐gānu pūnuga tā vachchinānu vĕravu dĕliyudām̐kā vĕṁḍele yāḍuduru (||āda||) tama̮iṁṭane vuṁḍana tagavudo naḍasina jamaḽine sādiṁturu saṁgaḍivāru ramaṇum̐ ḍaṁdugum̐gānu rām̐pugā naḍḍamāḍina amarani kām̐kadoḍa naggala māḍuduru (||āda||) ichchagame sesinānu yĕravu leguṁḍinānu vachchivachchi mīruduru vaṁtulavāru nichcha śhrīveṁkaḍeśhum̐ḍu ninnum̐ bāyagiṭluṁḍĕ vichchanaviḍi nādani vevelu nāḍuduru