Title (Indic)ఆతని నన్ను నన్నట్టే యనరాదా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని నన్ను నన్నట్టే యనరాదా తోతో వలపక్షము దోము గాదా (॥ఆతని॥) ఉప్పటించి యాతఁడు నన్నొకటోకటె యాఁడగా అప్పటి నన్నే కోపించే వవునే నీవు రెప్పుచూపుల వాఁడే రేసులు పుట్టించఁగాను చెప్పేవు నాకే బుద్ది చెల్లునా నీకు (॥ఆతని॥) చలము సాదించి వాఁడే చెంతకు వచ్చి యుండఁగా తలవంచుకొమ్మనేవు తగునేనీవు మలసి నవ్వులు నవ్వి మన నుడికించఁగాను కలయు మనేవు నన్ను కటకటా నీవు (॥ఆతని॥) వింతవానలతోడ వీఁడె వద్దఁ గూచుండఁగా యెంతయినా నలుగనీవు యేమే నీవు పంతపు శ్రీవేంకటాద్రిపతి నన్నుఁ గూడ గాను కొంత వెఱఁ గంద నీవు గొణఁగ నేలే నీకు English(||pallavi||) ādani nannu nannaṭṭe yanarādā todo valabakṣhamu domu gādā (||ādani||) uppaḍiṁchi yādam̐ḍu nannŏgaḍogaḍĕ yām̐ḍagā appaḍi nanne kobiṁche vavune nīvu rĕppusūbula vām̐ḍe resulu puṭṭiṁcham̐gānu sĕppevu nāge buddi sĕllunā nīgu (||ādani||) salamu sādiṁchi vām̐ḍe sĕṁtagu vachchi yuṁḍam̐gā talavaṁchugŏmmanevu tagunenīvu malasi navvulu navvi mana nuḍigiṁcham̐gānu kalayu manevu nannu kaḍagaḍā nīvu (||ādani||) viṁtavānaladoḍa vīm̐ḍĕ vaddam̐ gūsuṁḍam̐gā yĕṁtayinā naluganīvu yeme nīvu paṁtabu śhrīveṁkaḍādribadi nannum̐ gūḍa gānu kŏṁta vĕṟam̐ gaṁda nīvu gŏṇam̐ga nele nīgu