Title (Indic)ఆతని నడిగి రారే అందు కేది బుద్ది నాకు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని నడిగి రారే అందు కేది బుద్ది నాకు యీతలఁ దనకుఁ గానే యిట్లున్నదాననూ (॥॥) మనసులోఁ దనతోను మాటలాడే నంటేను యెనలేని నివ్వెఱఁగు లెడ మియ్యవూ కనుచూపులే యెదురుగానైన నంపే నంటే అనిశము నాసిగ్గులు అడ్డాలు వచ్చీని (॥॥) కలలోనైనాఁ దన్నుఁ గౌఁగిలించుకొనే నంటే నెలకొన్న విరహాన నిద్దుర రాదూ చెలరేఁగి తనరూపు చేతుల వ్రాసేనంటే తొలఁకుఁ బరవశాలు తోడు గావూ (॥॥) వీనులఁ దన కతలు వినియైనాఁ జొక్కే నంటే వూనిన తమకములు వుప్పతిల్లీని ఆనుక శ్రీ వేంకటేశుఁ డంతలోనే నన్నుఁగూడె నే నిట్టే పొగడే నంటే నిండీ సంతోమూ English(||pallavi||) ādani naḍigi rāre aṁdu kedi buddi nāgu yīdalam̐ danagum̐ gāne yiṭlunnadānanū (||||) manasulom̐ danadonu māḍalāḍe naṁṭenu yĕnaleni nivvĕṟam̐gu lĕḍa miyyavū kanusūbule yĕdurugānaina naṁpe naṁṭe aniśhamu nāsiggulu aḍḍālu vachchīni (||||) kalalonainām̐ dannum̐ gaum̐giliṁchugŏne naṁṭe nĕlagŏnna virahāna niddura rādū sĕlarem̐gi tanarūbu sedula vrāsenaṁṭe tŏlam̐kum̐ baravaśhālu toḍu gāvū (||||) vīnulam̐ dana kadalu viniyainām̐ jŏkke naṁṭe vūnina tamagamulu vuppadillīni ānuga śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalone nannum̐gūḍĕ ne niṭṭe pŏgaḍe naṁṭe niṁḍī saṁtomū