Title (Indic)ఆతని మనసు నేనే అన్నిటా నెఱుఁగుదును WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని మనసు నేనే అన్నిటా నెఱుఁగుదును ఘాత లెంత చూపినా కరఁగ దెంతైనా (॥ఆత॥) చెలులాల మీరు బుద్ది చెప్పకురే పతికిని వలపు వద్దనబోతే వడిబడును తలఁచుక మా ఇంటికి తనయంతనే రానీ తెలుపఁబోతే మంకు దేర దెంతైనా (॥ఆత॥) చేయివట్టి తియ్యకురే చెలరేఁగి రమణుని చాయ కొత్తితే గుణము చండిపడును పాయక తానే వుండీఁ బట్టినచలమైతేను పాయపు మదము మట్టుపడదు యెంతైనా (॥ఆత॥) అనిశము పైపైని ఆనలెల్ల బెట్టకురే పెనఁగితే ప్రియములు పిప్పిగట్టును యెనసె శ్రీవేంకటేశుఁ డింతలో దానె నన్ను వెనకటిపొందు యిఁక వింతగాదెంతైనా English(||pallavi||) ādani manasu nene anniḍā nĕṟum̐gudunu ghāda lĕṁta sūbinā karam̐ga dĕṁtainā (||āda||) sĕlulāla mīru buddi sĕppagure padigini valabu vaddanabode vaḍibaḍunu talam̐suga mā iṁṭigi tanayaṁtane rānī tĕlubam̐bode maṁku dera dĕṁtainā (||āda||) seyivaṭṭi tiyyagure sĕlarem̐gi ramaṇuni sāya kŏttide guṇamu saṁḍibaḍunu pāyaga tāne vuṁḍīm̐ baṭṭinasalamaidenu pāyabu madamu maṭṭubaḍadu yĕṁtainā (||āda||) aniśhamu paibaini ānalĕlla bĕṭṭagure pĕnam̐gide priyamulu pippigaṭṭunu yĕnasĕ śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo dānĕ nannu vĕnagaḍibŏṁdu yim̐ka viṁtagādĕṁtainā