Title (Indic)ఆతని మంచితనము అట్టే నా మంకుఁదనము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని మంచితనము అట్టే నా మంకుఁదనము ఘాతల నే నెంచుకొంటేఁ గరఁగీ నామనసు (॥ఆతని॥) యింటివాకిటఁ దా నుండి యిట్టె నన్నుఁ బిలువఁగ అంటఁ గాక వున్నదాన ననిపించితి బంటువలెఁ దా వాకిటఁ బవళించి వుండఁగాను మంటమారితనమున మాటలాడ నైతిని (॥ఆతని॥) పానుపుమీఁదికి వచ్చి పైఁ జేయి వేసితేను ఆన వెట్టి నిద్ర వచ్చీ నని తోసితి దానికిఁ గోపించుకోక తతి గాచు కుండఁగాను లేనగవుతోఁ గొంత లేచి మొక్క నైతిని (॥ఆతని॥) బలిమి శ్రీవెంకటాద్రిపతి నన్నుఁ గూడఁ గాను మెలుపున నాచేయి మీఁదు సేసితి అలమేలుమంగ నేను ఆతఁడే నన్ను మెచ్చఁగా కిలకిల నవ్వుకొంటా కిన్నెర మీఁటితిని English(||pallavi||) ādani maṁchidanamu aṭṭe nā maṁkum̐danamu ghādala ne nĕṁchugŏṁṭem̐ garam̐gī nāmanasu (||ādani||) yiṁṭivāgiḍam̐ dā nuṁḍi yiṭṭĕ nannum̐ biluvam̐ga aṁṭam̐ gāga vunnadāna nanibiṁchidi baṁṭuvalĕm̐ dā vāgiḍam̐ bavaḽiṁchi vuṁḍam̐gānu maṁṭamāridanamuna māḍalāḍa naidini (||ādani||) pānubumīm̐digi vachchi paim̐ jeyi vesidenu āna vĕṭṭi nidra vachchī nani tosidi dānigim̐ gobiṁchugoga tadi gāsu kuṁḍam̐gānu lenagavudom̐ gŏṁta lesi mŏkka naidini (||ādani||) balimi śhrīvĕṁkaḍādribadi nannum̐ gūḍam̐ gānu mĕlubuna nāseyi mīm̐du sesidi alamelumaṁga nenu ādam̐ḍe nannu mĕchcham̐gā kilagila navvugŏṁṭā kinnĕra mīm̐ṭidini