Title (Indic)ఆతని కొక్కతెవే నీవాలవైతివా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని కొక్కతెవే నీవాలవైతివా యేతులు నెమ్మెలు నీవు యిందే చూపేవా (॥ఆత॥) యిచ్చకములెల్లా నాడి యితవరివైవిభుని మచ్చికలు రేఁపి భ్రమలఁబెట్టేవు కచ్చువెట్టి నేమెల్లాఁ గాచుకుండఁగా నీకు యిచ్చోటఁ జెల్లుబడి ఇఁక నెంత గలదే (॥ఆత॥) వట్టినవ్వులెల్లా నవ్వి వద్దనుండి యాతని- చుట్టమవై మాటలనే చొక్కించేవు అట్టె నీ మిందరమును ఆసపడివుండఁగాను నెట్టుకొని నీబలిమి నెరపఁగవలెనా (॥ఆత॥) చెనకి కాఁగిట నించి శ్రీవేంకటేశ్వరుని- మనసు రంజిల్లఁజేసి మరిగించేవు యెనసె నీతఁడే మమ్ము నీడుజోడైతిమి నేము తనియవు నీవింకా తమకించఁదగునా English(||pallavi||) ādani kŏkkadĕve nīvālavaidivā yedulu nĕmmĕlu nīvu yiṁde sūbevā (||āda||) yichchagamulĕllā nāḍi yidavarivaivibhuni machchigalu rem̐pi bhramalam̐bĕṭṭevu kachchuvĕṭṭi nemĕllām̐ gāsuguṁḍam̐gā nīgu yichchoḍam̐ jĕllubaḍi im̐ka nĕṁta galade (||āda||) vaṭṭinavvulĕllā navvi vaddanuṁḍi yādani- suṭṭamavai māḍalane sŏkkiṁchevu aṭṭĕ nī miṁdaramunu āsabaḍivuṁḍam̐gānu nĕṭṭugŏni nībalimi nĕrabam̐gavalĕnā (||āda||) sĕnagi kām̐giḍa niṁchi śhrīveṁkaḍeśhvaruni- manasu raṁjillam̐jesi marigiṁchevu yĕnasĕ nīdam̐ḍe mammu nīḍujoḍaidimi nemu taniyavu nīviṁkā tamagiṁcham̐dagunā