Title (Indic)ఆతని కరుణ గల్తే నన్నియునయ్యీఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని కరుణ గల్తే నన్నియునయ్యీఁ గాక కాతరానఁ బెడరేఁచి గాసి సేతురటవే (॥ఆత॥) తనబత్తే కలిగితే దండకు వచ్చీఁగాక పెనఁగి బలిమిచేసి పిలుతురటే మనసునఁ గలిగితే మన్నన నేలీఁ గాక కొనచూపులను జూచి కొసరుదురటవే (॥ఆత॥) నవ్వు నవ్వవలసితే నామొగము చూచీఁగాక దవ్వులనుండి చేతఁ దట్టుదురటే రవ్వఁ జుట్టరికమైతే రతులు నేర్పీఁగాక యివ్వలా నవ్వలా నుండి యెచ్చరింతురటవే (॥ఆత॥) కాఁపుర మియ్యకోలైతే కాఁగిలించుకొనీఁ గాక మీపు రేపుఁ బై కొని మలతురటే చేపట్టి నన్నుఁ గూడె శ్రీవేంకటేశుఁడు నేఁడు రాఁపుచేసి వలపులు రచ్చ వేతురటవే English(||pallavi||) ādani karuṇa galde nanniyunayyīm̐ gāga kādarānam̐ bĕḍarem̐si gāsi seduraḍave (||āda||) tanabatte kaligide daṁḍagu vachchīm̐gāga pĕnam̐gi balimisesi piluduraḍe manasunam̐ galigide mannana nelīm̐ gāga kŏnasūbulanu jūsi kŏsaruduraḍave (||āda||) navvu navvavalaside nāmŏgamu sūsīm̐gāga davvulanuṁḍi sedam̐ daṭṭuduraḍe ravvam̐ juṭṭarigamaide radulu nerbīm̐gāga yivvalā navvalā nuṁḍi yĕchchariṁturaḍave (||āda||) kām̐pura miyyagolaide kām̐giliṁchugŏnīm̐ gāga mību rebum̐ bai kŏni maladuraḍe sebaṭṭi nannum̐ gūḍĕ śhrīveṁkaḍeśhum̐ḍu nem̐ḍu rām̐pusesi valabulu rachcha veduraḍave