Title (Indic)ఆతని కన్నియు నింపులై యుండఁగా WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని కన్నియు నింపులై యుండఁగా యీతల వెరగువడ నేలే యెవ్వరికి (॥॥) వలసిన రమణుని వనిత సొలసితేను వెలయ వినఁగ నేలే వేరొకతెకు చెలరేఁగి యాతఁడాపె చేతికి లోనై వుండఁగా వలవని వాదు లేలే వద్దివారికి (॥॥) సిగ్గువడ కాపె పతిఁ జెరఁగువట్టి తియ్యఁగా వొగ్గి విడిపించ నేలే వున్నవారికి యెగ్గు లే కాతని కవి యేలాటాలై వుండఁగాను కగ్గి కాంతాళించ నేలే కన్నవారికి (॥॥) మక్కువ నాపె గునిసి మగని తోఁ బెనఁగఁగా చక్కట్లు దిద్ద నేలే సవతులకు యిక్కువ శ్రీ వేంకటేశుఁడితఁడే మనలఁగూడే వక్కణ లడుగ నేలే వావి గలవారికి English(||pallavi||) ādani kanniyu niṁpulai yuṁḍam̐gā yīdala vĕraguvaḍa nele yĕvvarigi (||||) valasina ramaṇuni vanida sŏlasidenu vĕlaya vinam̐ga nele verŏgadĕgu sĕlarem̐gi yādam̐ḍābĕ sedigi lonai vuṁḍam̐gā valavani vādu lele vaddivārigi (||||) sigguvaḍa kābĕ padim̐ jĕram̐guvaṭṭi tiyyam̐gā vŏggi viḍibiṁcha nele vunnavārigi yĕggu le kādani kavi yelāḍālai vuṁḍam̐gānu kaggi kāṁtāḽiṁcha nele kannavārigi (||||) makkuva nābĕ gunisi magani tom̐ bĕnam̐gam̐gā sakkaṭlu didda nele savadulagu yikkuva śhrī veṁkaḍeśhum̐ḍidam̐ḍe manalam̐gūḍe vakkaṇa laḍuga nele vāvi galavārigi