Title (Indic)ఆతని భ్రమయించే(చవే?) వే అండనున్నాఁడు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతని భ్రమయించే(చవే?) వే అండనున్నాఁడు యేతులు నెమ్మెలుఁ జూపేవిప్పుడే మాతోనా (॥ఆతని॥) చన్నులు ఘనములైతే సాధించవే రమణుని కన్నులు ఘనములైతే కాఁడి పారఁ జూడవే యెన్న నీసింగారాలు యెవ్వరికిఁ జూపేవు పన్నిన సవతినింతే పగటు మాతోనా (॥ఆతని॥) వలపు చిత్తాననుంటే వంచుకోవే నీవిభుఁని పలుకుల నేర్పులుంటేఁ బచరించవే సొలపుల నీనటన చూచేవారిందెవ్వరే చెలిమికత్తెలమింతే చేఁతలు మాతోనా (॥ఆతని॥) సిగ్గులు సెలవినుంటే శ్రీవేంకటేశు ముంచవే నిగ్గులు చెక్కులనుంటే నీటు చూపవే యెగ్గులేక ఆతఁడే యిద్దరినేలెను నేఁడు వెగ్గళించి మురిసేటి వింతలు మాతోనా English(||pallavi||) ādani bhramayiṁche(save?) ve aṁḍanunnām̐ḍu yedulu nĕmmĕlum̐ jūbevippuḍe mādonā (||ādani||) sannulu ghanamulaide sādhiṁchave ramaṇuni kannulu ghanamulaide kām̐ḍi pāram̐ jūḍave yĕnna nīsiṁgārālu yĕvvarigim̐ jūbevu pannina savadiniṁte pagaḍu mādonā (||ādani||) valabu sittānanuṁṭe vaṁchugove nīvibhum̐ni palugula nerbuluṁṭem̐ basariṁchave sŏlabula nīnaḍana sūsevāriṁdĕvvare sĕlimigattĕlamiṁte sem̐talu mādonā (||ādani||) siggulu sĕlavinuṁṭe śhrīveṁkaḍeśhu muṁchave niggulu sĕkkulanuṁṭe nīḍu sūbave yĕggulega ādam̐ḍe yiddarinelĕnu nem̐ḍu vĕggaḽiṁchi muriseḍi viṁtalu mādonā