Title (Indic)ఆడనే తెలుసుకొనే వాపె గుణము WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడనే తెలుసుకొనే వాపె గుణము యీడ నన్నేలడిగేవు యింతేసి నీవు (॥ఆడ॥) తలఁపు నీకప్పగించి తరుణి పానుపుమీఁదఁ నలసి పవ్వళించిన దదే లోనను అలిగి రానట్టున్నది అందరికిఁ జూడ నిది చెలువుఁడ దగ్గరి విచ్చేయవయ్యా నీవు (॥ఆడ॥) తుమ్మిద మోఁతకుఁగాను తొయ్యలి ముసుఁగు దీసి యిమ్ములఁ బలుక దదే యెవ్వరితోడ కమ్మి యెదిరికిఁ జూడ గర్వమువలె నున్నది చిమ్ముల నీరాక యిట్టె చెప్పివయ్యా నీవు (॥ఆడ॥) నీమొగము చచుదాఁకా నెలఁత కన్నులు మూసి వోముచుఁ గైకొని యెట్టు వున్నది నేఁడు కామించి శ్రీ వేంకటేశ కలసితి వింతలోన నాములుగా నా పెతోడ నవ్వవయ్యా నీవు English(||pallavi||) āḍane tĕlusugŏne vābĕ guṇamu yīḍa nannelaḍigevu yiṁtesi nīvu (||āḍa||) talam̐pu nīgappagiṁchi taruṇi pānubumīm̐dam̐ nalasi pavvaḽiṁchina dade lonanu aligi rānaṭṭunnadi aṁdarigim̐ jūḍa nidi sĕluvum̐ḍa daggari vichcheyavayyā nīvu (||āḍa||) tummida mom̐tagum̐gānu tŏyyali musum̐gu dīsi yimmulam̐ baluga dade yĕvvaridoḍa kammi yĕdirigim̐ jūḍa garvamuvalĕ nunnadi simmula nīrāga yiṭṭĕ sĕppivayyā nīvu (||āḍa||) nīmŏgamu sasudām̐kā nĕlam̐ta kannulu mūsi vomusum̐ gaigŏni yĕṭṭu vunnadi nem̐ḍu kāmiṁchi śhrī veṁkaḍeśha kalasidi viṁtalona nāmulugā nā pĕdoḍa navvavayyā nīvu