Title (Indic)ఆడఁగల మాటలెల్లా నాడితి నేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడఁగల మాటలెల్లా నాడితి నేను వేడుకలిన్నియుఁ జెల్లె విచారములేఁటికి (॥ఆడఁగల॥) కంటిమి నీగుణములు కన్నులఁ జూచినపుడే వింటిమి నీసుద్దులెల్ల వేగుదాఁకాను తొంటివలెఁ గాదు నీవు దొరవైతివిఁకనేమి అంటేఁ జవులు గావు ఆయనాయఁ బనులు (॥ఆడఁగల॥) పట్టితినంగమచ్చెము భావించి చూచినపుడె పెట్టితి నీమీఁదనొక్క పెనునేరమి దిట్టవైతివిన్నిటాను తెరవలకాఁగిటను యెట్టుననరాదు నిన్నునిఁక నేల కొసర (॥ఆడఁగుల॥) చేకొంటి నీచేఁతలు చేయి ముంచినప్పుడే దాకొంటి నీరతులలో దగ్గరి నేఁడు యీకడ శ్రీవేంకటేశ యిరవైన మోహముల- నేకమైతిమిద్దరము నిఁకనేల మరఁగు English(||pallavi||) āḍam̐gala māḍalĕllā nāḍidi nenu veḍugalinniyum̐ jĕllĕ visāramulem̐ṭigi (||āḍam̐gala||) kaṁṭimi nīguṇamulu kannulam̐ jūsinabuḍe viṁṭimi nīsuddulĕlla vegudām̐kānu tŏṁṭivalĕm̐ gādu nīvu dŏravaidivim̐kanemi aṁṭem̐ javulu gāvu āyanāyam̐ banulu (||āḍam̐gala||) paṭṭidinaṁgamachchĕmu bhāviṁchi sūsinabuḍĕ pĕṭṭidi nīmīm̐danŏkka pĕnunerami diṭṭavaidivinniḍānu tĕravalagām̐giḍanu yĕṭṭunanarādu ninnunim̐ka nela kŏsara (||āḍam̐gula||) segŏṁṭi nīsem̐talu seyi muṁchinappuḍe dāgŏṁṭi nīradulalo daggari nem̐ḍu yīgaḍa śhrīveṁkaḍeśha yiravaina mohamula- negamaidimiddaramu nim̐kanela maram̐gu