Title (Indic)ఆడఁగల మాటగాఁగా నాడితిఁ గాక WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడఁగల మాటగాఁగా నాడితిఁ గాక పాడిపంతాలిందులోన పచారించ నేఁటికే (॥ఆడ॥) మనసునఁ గలితేనే మాటలాడనింపు వుట్ట చనవులు సతమైతే సంతోసమౌను పెనఁగఁగఁ జోటిచ్చితే ప్రియములు గడునిండు ఘనుఁడు తానేమన్నాఁ గాదనేనటవే (॥ఆడ॥) ఆసగలిగినచోట అన్నిటాఁ గొసరఁదగు వేసట లేనిపొందు వెగటుగాదు వాసితోడిమెలఁకువ వలపు దానె పుట్టించు సేసవెట్టేఁ దనమాట చెల్లెనని యనవే (॥ఆడ॥) పరగ నవ్వు నవ్వితే పనులెల్లాఁ జేకూరు తరితీపులైతేనే తమిరేఁగును యిరవై శ్రీవేంకటేశుఁడింతలోనే నన్నునేలె సరసమెంతాడినాను సమ్మతి నాకనవే English(||pallavi||) āḍam̐gala māḍagām̐gā nāḍidim̐ gāga pāḍibaṁtāliṁdulona pasāriṁcha nem̐ṭige (||āḍa||) manasunam̐ galidene māḍalāḍaniṁpu vuṭṭa sanavulu sadamaide saṁtosamaunu pĕnam̐gam̐gam̐ joḍichchide priyamulu gaḍuniṁḍu ghanum̐ḍu tānemannām̐ gādanenaḍave (||āḍa||) āsagaliginasoḍa anniḍām̐ gŏsaram̐dagu vesaḍa lenibŏṁdu vĕgaḍugādu vāsidoḍimĕlam̐kuva valabu dānĕ puṭṭiṁchu sesavĕṭṭem̐ danamāḍa sĕllĕnani yanave (||āḍa||) paraga navvu navvide panulĕllām̐ jegūru taridībulaidene tamirem̐gunu yiravai śhrīveṁkaḍeśhum̐ḍiṁtalone nannunelĕ sarasamĕṁtāḍinānu sammadi nāganave