Title (Indic)ఆడమె యింకనేమీ నౌఁగాదనుచుఁ దన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆడమె యింకనేమీ నౌఁగాదనుచుఁ దన్ను సూడుఁబాడు దిద్దేవాఁడు సుద్దులిన్ని నేరఁడా (॥ఆడ॥) పెక్కులు నేర్చినతఁడు బెంబాడిచేఁతలతఁడు దిక్కులఁ దననేరాలు దిద్దుకోలేఁడా చక్కని పదారువేలు సతులఁ దెచ్చినతఁడు పక్కన మావంటివారి భ్రమయించనోపఁడా (॥ఆడ॥) రాతిరిపనులాతఁడు రవ్వల కెక్కినతఁడు భీతిలేక ఆనలెల్లాఁ బెట్టుకోలేఁడా ఈతల రుక్మిణీదేవి నెత్తుక తెచ్చినతఁడు చేతులు మాపై జాఁచి చెనకక మానునా (॥ఆడ॥) దేవర దానై నతఁడు దిమ్మరివిద్యలతఁడు యీవేళ నాకోరిక యీడేర్చలేఁడా శ్రీ వేంకటేశుఁ డితఁడు చేరి నన్నునిటు గూడె వేవేలు మన్ననలచే వెలయించుటరుదా English(||pallavi||) āḍamĕ yiṁkanemī naum̐gādanusum̐ dannu sūḍum̐bāḍu diddevām̐ḍu suddulinni neram̐ḍā (||āḍa||) pĕkkulu nersinadam̐ḍu bĕṁbāḍisem̐taladam̐ḍu dikkulam̐ dananerālu diddugolem̐ḍā sakkani padāruvelu sadulam̐ dĕchchinadam̐ḍu pakkana māvaṁṭivāri bhramayiṁchanobam̐ḍā (||āḍa||) rādiribanulādam̐ḍu ravvala kĕkkinadam̐ḍu bhīdilega ānalĕllām̐ bĕṭṭugolem̐ḍā īdala rukmiṇīdevi nĕttuga tĕchchinadam̐ḍu sedulu mābai jām̐si sĕnagaka mānunā (||āḍa||) devara dānai nadam̐ḍu dimmarividyaladam̐ḍu yīveḽa nāgoriga yīḍersalem̐ḍā śhrī veṁkaḍeśhum̐ ḍidam̐ḍu seri nannuniḍu gūḍĕ vevelu mannanalase vĕlayiṁchuḍarudā