Title (Indic)ఆతఁడు తానే మన్నించినపుడు నన్ను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు తానే మన్నించినపుడు నన్ను చేతికి లోనుగానే చెప్పవే నా వలపు (॥॥) తలఁపు దెలుకో దయపుట్ట మాటలాడు చలము సాదించకు చతురునితో సొలయకు సారె సారె చూపు వినయములే చెలియరో యీ రీతిఁ జెప్పవే నా వలపు (॥॥) యెదుటనే నిలుచుండు ఇచ్చకమే పచరించు పదరకు మెంతయినా పతితోడను పొదిగి కొలువు సేయి పుట్టించు వేడుక లెల్లా చెదరకుండాఁ దగిలి చెప్పవే నా వలపు (॥॥) మొక్కుము నా మారుగాను మునుకొని యెచ్చరించు వెక్కసాన దూరకు శ్రీ వేంకటేశ్వరు తక్కక నన్నింతలోనే తా నిందు విచ్చేసి కూడే చెక్కు నొక్కి యింకానుఁ జెప్పవే నా వలపూ English(||pallavi||) ādam̐ḍu tāne manniṁchinabuḍu nannu sedigi lonugāne sĕppave nā valabu (||||) talam̐pu dĕlugo dayabuṭṭa māḍalāḍu salamu sādiṁchagu sadurunido sŏlayagu sārĕ sārĕ sūbu vinayamule sĕliyaro yī rīdim̐ jĕppave nā valabu (||||) yĕduḍane nilusuṁḍu ichchagame pasariṁchu padaragu mĕṁtayinā padidoḍanu pŏdigi kŏluvu seyi puṭṭiṁchu veḍuga lĕllā sĕdaraguṁḍām̐ dagili sĕppave nā valabu (||||) mŏkkumu nā mārugānu munugŏni yĕchchariṁchu vĕkkasāna dūragu śhrī veṁkaḍeśhvaru takkaga nanniṁtalone tā niṁdu vichchesi kūḍe sĕkku nŏkki yiṁkānum̐ jĕppave nā valabū