Title (Indic)ఆతఁడు చేసినభాగ్య మది యెట్టిదో WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు చేసినభాగ్య మది యెట్టిదో చేతికి వచ్చినమేలై చెంతలనే నిలిచె (॥అతఁ॥) చెలి నీవు పతితోడ నెలవి నవ్వినవ్వు వెలయనాతని మతి వెన్నెలగాసె నిలిచి కట్టెదురను నీవుండినభావము తలకొన్నముంగిటినిదా(దా?) నమై నిలిచె (॥అతఁ॥) జాఱకుండా రమణునిఁ జక్కఁగఁ జూచినచూపు మీఱి యాతనిమేనిపై మెఱుఁగు లెక్కె వేఱులేక నీవిప్పుడు వీడెమిచ్చిన భావము ఆఱడితో మదనుని అడపమై నిలిచె (॥అతఁ॥) తోడనే శ్రీవేంకటేశుతో నీవాడినమాటలు జాడ నాతనిచెవులకు చవులు మించె కూడితివి యింతోనే కూరిమి నీరతి యిదె పాడితో యింటిలోపలిబండారమై నిలిచె English(||pallavi||) ādam̐ḍu sesinabhāgya madi yĕṭṭido sedigi vachchinamelai sĕṁtalane nilisĕ (||adam̐||) sĕli nīvu padidoḍa nĕlavi navvinavvu vĕlayanādani madi vĕnnĕlagāsĕ nilisi kaṭṭĕduranu nīvuṁḍinabhāvamu talagŏnnamuṁgiḍinidā(dā?) namai nilisĕ (||adam̐||) jāṟaguṁḍā ramaṇunim̐ jakkam̐gam̐ jūsinasūbu mīṟi yādanimenibai mĕṟum̐gu lĕkkĕ veṟulega nīvippuḍu vīḍĕmichchina bhāvamu āṟaḍido madanuni aḍabamai nilisĕ (||adam̐||) toḍane śhrīveṁkaḍeśhudo nīvāḍinamāḍalu jāḍa nādanisĕvulagu savulu miṁchĕ kūḍidivi yiṁtone kūrimi nīradi yidĕ pāḍido yiṁṭilobalibaṁḍāramai nilisĕ