Title (Indic)ఆతఁడు సేసేచేఁత కవి సరి దాఁకితేను WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు సేసేచేఁత కవి సరి దాఁకితేను యీతల నే నిందరిలో నిది వెంగెమాడుటా (॥ఆత॥) దగ్గరి యాతనెదుట తలచిక్కు దీసుకొంటే వెగ్గళించి నేఁ బతిని వెంగెమాడుటా సిగ్గుతోడ సురటిని చెమట విసరుకొంటే అగ్గలముగా నప్పటి నది వెంగెమాడుటా (॥ఆత॥) తఱి నితనియెదుట తమ్ముల ముమిసితేను వెఱవక నే నిప్పుడు వెంగెమాడుటా నెఱవుగ నామేని నీడలు చూచుకొంటే అఱిముఱిఁ దనుఁ జూచి అది వెంగెమాడుటా (॥ఆత॥) చిలుకనుఁ బేరుకొని శ్రీరామ రామ యంటే వెలయఁగ నే నింతలో వెంగెమాడుటా యెలమి శ్రీవెంకటేశుఁ డిందులకె నన్నుఁ గూడె అలమి మోముచూచితే నది వెంగెమాడుటా English(||pallavi||) ādam̐ḍu sesesem̐ta kavi sari dām̐kidenu yīdala ne niṁdarilo nidi vĕṁgĕmāḍuḍā (||āda||) daggari yādanĕduḍa talasikku dīsugŏṁṭe vĕggaḽiṁchi nem̐ badini vĕṁgĕmāḍuḍā siggudoḍa suraḍini sĕmaḍa visarugŏṁṭe aggalamugā nappaḍi nadi vĕṁgĕmāḍuḍā (||āda||) taṟi nidaniyĕduḍa tammula mumisidenu vĕṟavaga ne nippuḍu vĕṁgĕmāḍuḍā nĕṟavuga nāmeni nīḍalu sūsugŏṁṭe aṟimuṟim̐ danum̐ jūsi adi vĕṁgĕmāḍuḍā (||āda||) siluganum̐ berugŏni śhrīrāma rāma yaṁṭe vĕlayam̐ga ne niṁtalo vĕṁgĕmāḍuḍā yĕlami śhrīvĕṁkaḍeśhum̐ ḍiṁdulagĕ nannum̐ gūḍĕ alami momusūside nadi vĕṁgĕmāḍuḍā