Title (Indic)ఆతఁడు సేసేటి వినయమునకా నీబిగువు WorkAnnamayya songs LanguageTelugu Credits Role Artist Writer Annamacharya LyricsTelugu(॥పల్లవి॥) ఆతఁడు సేసేటి వినయమునకా నీబిగువు చేతికి లోనై వుండఁగా చిడుముడి దగునా (॥ఆతఁ॥) చెలువుఁడు వీడెము చేతఁబట్టుకున్న వాఁడు అలుక లెందాఁకాను అదుకోరాదా వెలలేని వెన్నెలలు వేగినంతాఁ గాయఁగాను వెలి నుండే యెవ్వరికి వెట్టఁబడఁదగునా (॥ఆతఁ॥) వచ్చివచ్చి రమణుఁడు వాకిటఁ గాచుకుండఁగా పెచ్చువెరిగే వెందాఁకాఁ బిలువరాదా యెచ్చరించి దగ్గరనే యేరు వారుచుండఁగాను కుచ్చితాన లోలో దప్పిగొనఁదగునా (॥ఆతఁ॥) శ్రీవేంకటేశ్వరుఁడు చేరి కాఁగిలించినాఁడు లావు లెందాఁకాఁ జూసేవు మోవియ్యరాదా భావించి వలపులపంట వండి వుండఁగాను ఆవటించి రతిఁ దనియక వుండఁదగునా English(||pallavi||) ādam̐ḍu seseḍi vinayamunagā nībiguvu sedigi lonai vuṁḍam̐gā siḍumuḍi dagunā (||ādam̐||) sĕluvum̐ḍu vīḍĕmu sedam̐baṭṭugunna vām̐ḍu aluga lĕṁdām̐kānu adugorādā vĕlaleni vĕnnĕlalu veginaṁtām̐ gāyam̐gānu vĕli nuṁḍe yĕvvarigi vĕṭṭam̐baḍam̐dagunā (||ādam̐||) vachchivachchi ramaṇum̐ḍu vāgiḍam̐ gāsuguṁḍam̐gā pĕchchuvĕrige vĕṁdām̐kām̐ biluvarādā yĕchchariṁchi daggarane yeru vārusuṁḍam̐gānu kuchchidāna lolo dappigŏnam̐dagunā (||ādam̐||) śhrīveṁkaḍeśhvarum̐ḍu seri kām̐giliṁchinām̐ḍu lāvu lĕṁdām̐kām̐ jūsevu moviyyarādā bhāviṁchi valabulabaṁṭa vaṁḍi vuṁḍam̐gānu āvaḍiṁchi radim̐ daniyaga vuṁḍam̐dagunā